బీర్‌తో స్థూలకాయానికి చెక్ : రోగాలను తరిమికొట్టే ఔషధం

Submitted on 6 December 2019
How Beer can help combat obesity and other Diseases 

మీరు బీరు ప్రియులా? ప్రతిరోజు చల్లచల్లని బీరు తాగే అలవాటు ఉందా? స్ట్రాంగ్ బీర్ అయితే మరి మంచిది. అయితే  మిమ్మల్ని రోగాలు ఏం చేయలేవు. బీరు తాగే వారిలో స్థూలకాయం సహా ఇతర వ్యాధులు దరి చేరవని ఓ కొత్త అధ్యయనం వెల్లడించింది.

హాలీడే సీజన్ కావొచ్చు లేదా ఏదైనా ఫంక్షన్ కావొచ్చు.. బీరు ప్రియులకు ఇక పండగే. బీరు మీద బీరు తాగుతూ చిందేస్తుంటారు. తెగ ఎంజాయ్ చేస్తుంటారు. సాధారణంగా ఆల్కహాల్ ఆరోగ్యానికి హానికరమని అంటారు. కొన్నిసార్లు అదే కొన్నిరకాల వ్యాధులకు మంచి ఔషధంగా పనిచేస్తాయని అంటున్నారు రీసెర్చర్లు.

బీరు తాగితే రోగాలు పోతాయా? :
నిర్దిష్టమైన రీతిలో బీరును పుచ్చుకున్న వారిలో పెద్ద రోగాలతో ఫైట్ చేస్తుందని చెబుతున్నారు. ఎందరినో వేధిస్తున్న స్థూలకాయం కూడా బీర్ దెబ్బకు పరార్ కావాల్సిందే అంటున్నారు. బీరు తాగితే రోగాలు పోతాయా? అంటే అవుననే అంటున్నారు పరిశోధకులు. మీకు నచ్చిన బీరు ఏదో ఒకటి తాగండి.. స్థూలకాయాన్ని తరిమికొట్టండని సూచిస్తున్నారు.

బీరు బాటిళ్లలోని పొంగుతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయట. బీరు తయారీలో పులియబెట్టిన గింజ నుంచి వచ్చే ఆల్కహాల్‌లోని నురుగు.. కేవలం షుగర్‌ను మాత్రమే మార్చదని ఓ నివేదిక తెలిపింది. యాసిడ్‌గా ఏర్పడిన ఆ మిశ్రమం హానికరమైన బ్యాక్టీరియాను కూడా చంపేస్తుందని పరిశోధకులు తెలిపారు.

ఆమ్స్టర్డామ్ యూనివర్శిటీకి చెందిన నిపుణులు ప్రొఫెసర్ ఎరిక్ క్లాస్సెన్ ఈ అధ్యయనానికి సంబంధించి వివరణ ఇచ్చారు. రెట్టింపు కిణ్వ ప్రక్రియతో వచ్చే పొంగు నుంచి స్ట్రాంగ్ బీర్ తయారువుతుందని, ఇదెంతో ఆరోగ్యకరమైనదిగా ఆయన తెలిపారు. అలా అని ఒకటి కంటే ఎక్కువ మొత్తంలో బీరు తాగితే ఆరోగ్యం దెబ్బతినే అవకాశం కూడా లేకపోలేదన్నారు.

ప్రోబయోటిక్స్.. ఆరోగ్యానికి ఎందుకు మంచిదంటే? :
ప్రోబయోటిక్స్ ఆహరం ఎందుకు ఆరోగ్యానికి మంచిదంటే.. ప్రోబయోటిక్స్, ప్రేగులలో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా ఉత్పత్తి చేస్తుంది. కడుపులోని జీర్ణ సంబంధిత సమస్యలకు కారణమైన బ్యాక్టీరియాను చంపేస్తుంది. కేవలం పెరుగు మాత్రమే సహజ ప్రోబయోటిక్ ఆహారం అంటారు. అనారోగ్యకరమైన ఆహారాలు తింటే ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా నశిస్తాయి. తద్వారా జీర్ణ సమస్యలకు కారణమవుతాయి.

బోయెల్ (పేగు) క్యాన్సర్ , అల్జీమర్ (మతిమరుపు) వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కొన్ని ప్రోబయోటిక్స్ సాయంతో శరీరంలోని కొవ్వును కరిగిస్తాయని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి. అంటే.. మీ శరీరంలోని కేలరీలను తగ్గిస్తాయని అర్థం. 

జీర్ణ ప్రక్రియ సమయంలో తీసుకున్న ఆహారం నుంచి కేలరీలను ఖర్చు అయ్యేలా చేస్తాయి. ఎక్కువ మొత్తంలో ఆల్కాహాల్ సేవించినా కూడా మొత్తానికే ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీసే ప్రమాదం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ప్రతిరోజు ఒక (ప్రోబయోటిక్ రిచ్) బీర్ ను తాగడం ద్వారా మీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ప్రొఫెసర్ క్లాస్సెన్ స్పష్టం చేశారు. ఇంకెందుకు ఆలస్యం వెంటనే బీరు తాగండి.. లావు తగ్గండి.. క్రమంగా స్థూలకాయం నుంచి బయట పడండి. తస్మాత్ మీ ఆరోగ్యం జాగ్రత్త. 

Beer
Obesity
Diseases
Strong Beer
Probiotics
Beer Lovers

మరిన్ని వార్తలు