ఇండియాలో ఎప్పుడంటే? : హానర్ 20 సిరీస్ వచ్చేసింది

Submitted on 21 May 2019
Honor 20, Honor 20 Pro Launch : Global launch Today, Coming to India soon

చైనీస్ స్మార్ట్ ఫోన్ మేకర్ హువావే సబ్ బ్రాండ్ కంపెనీ Honor నుంచి లేటెస్ట్ ఫ్లాగ్ షిప్ సిరీస్ రిలీజ్ అయింది. లండన్ లో మంగళవారం (మే 21, 2019)రోజున జరిగిన ఈవెంట్ లో భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6:30 గంటలకు హానర్ 20 సిరీస్ ను గ్లోబల్ గా విడుదల చేసింది. లేటెస్ట్ ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్లలో హానర్ 20, హానర్ 20 ప్రో రెండు స్మార్ట్ ఫోన్లను కంపెనీ లాంచ్ చేసింది.

జూన్ 11న ఇండియాలో :
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్లలో ప్రీమియం ఫోన్లు గూగుల్ ఫిక్సల్ 3A, వన్ ప్లస్ 7 ప్రో, శాంసంగ్ గెలాక్సీ S10e ఫోన్లతో పోటీగా హానర్ సిరీస్ ను రిలీజ్ చేసింది. ఇండియాలో హానర్ 20 సిరీస్ ను జూన్ 11, 2019న లాంచ్ చేయనున్నట్టు ఈ కామర్స్ ఫ్లిప్ కార్ట్ లో వెల్లడించింది. హానర్ సిరీస్ నుంచి రెండు మోడల్స్ వస్తున్నాయి. అందులో హానర్ 20, హానర్ 20 ప్రో. ఈ రెండు మోడల్ ఫోన్లలో స్పెషిఫికేషన్లు, ఫీచర్లు ప్రత్యేక ఆకర్షణీయంగా ఉన్నాయి.

2018లో మే నెలలో ఇండియాలో హానర్ 10 సిరీస్ ను లాంచ్ చేసింది. ప్రపంచ ఐటీ దిగ్గజం, స్మార్ట్ ఫోన్ మేకర్ ఆపిల్ ఐఫోన్-ఎక్స్ మాదిరిగా నాచ్ డ్ డిస్ ప్లేతో రిలీజ్ చేశారు. హానర్ లేట్ ఫ్లాగ్ షిప్ ఫోన్లలో అల్ట్రాసోనిక్ ఫింగర్ ఫ్రింట్ సెన్సార్ ఫీచర్ స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉంది.

కిరిన్ 980 ప్రాసిసెర్ తో 6GB ర్యామ్ కెపాసిటీ ఉంది. హానర్ 20, హానర్ 20 ప్రో.. రెండు డివైజ్ లు ప్రీమియం మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్లగా మార్కెట్లోకి వస్తున్నాయి. హానర్ 20 సిరీస్ స్మార్ట్ ఫోన్ల ప్రారంభ ధర 499 యూరోలు (రూ.38వేల, 8వందలు) వరకు ఉంటుంది. 

స్పెషిఫికేషన్లు - ఫీచర్లు ఇవే : హానర్ 20, ప్రో
* స్పోర్ట్ 6.26 అంగుళాల FHD+ IPS LCD పంచ్ హోల్ డిస్ ప్లే
* 980 కిరిన్ ప్రాసిసర్, 6GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజీ
3750mAh బ్యాటరీ, 22.5 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ 
మ్యాజిక్ UI 2.1, ఆండ్రాయిడ్ 9పై ఆపరేటింగ్ సిస్టమ్
బ్యాక్ సైడ్.. క్వాడ్ కెమెరా సెటప్  
32MP సెల్ఫీ కెమెరా, 4000mAh బ్యాటరీ
* 48MP f/1.4 మెయిన్ కెమెరా 
* సోనీ ఫ్లాగ్ షిప్ IMX586 ఇమేజ్ సెన్సార్, ఐఓఎస్
8MP f/2.4 టెలిఫొటో లెన్స్, 3ఎక్స్ ఆప్టికల్ జూమ్ 
* 5ఎక్స్ హైబ్రిడ్ జూమ్, 30ఎక్స్ ఆప్టికల్ జూమ్
* 16MP f/2.2 అల్ట్రా వైడ్ కెమెరా, 2MP f/2.4 మాక్రో లెన్స్

Honor 20
Honor 20 Pro
Global launch
India launch soon
Huawei

మరిన్ని వార్తలు