అట్టుకుడుతున్న హాంకాంగ్...ప్రజలకు సీఈ క్షమాపణలు

Submitted on 16 June 2019
Hong Kong Protests:City Leader Apologizes

హాంకాంగ్ మళ్లీ నిరసనలతో అట్టుడుకున్నది. వేలాది మంది ప్రజలు మళ్లీ వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేపట్టారు.నిందితులను చైనాకు అప్పగించేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన వివాదాస్పద బిల్లుకు వ్యతిరేకంగా నిరసనలు చెలరేగిన విషయం తెలిసిందే. ప్రభుత్వం ఈ బిల్లును సస్పెండ్‌ చేసిందని శనివారం హాంకాగ్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటీవ్‌ కెర్రీలామ్‌ ప్రకటించినప్పటికీ  బిల్లును  రద్దు చేయాలని ఆందోళనకారులు డిమాండ్‌ చేస్తున్నారు. మరికొందరు కెర్రీ తన పదవికి రాజీనామా చేయాలని కోరుతున్నారు. 


ఆదివారం(జూన్-16,2019) మధ్యాహ్నం నుంచి భారీ సంఖ్యలో ప్రజలు సిటీలోని విక్టోరియా స్క్వేర్‌ దగ్గర గుమిగూడారు.నల్లని దుస్తులు ధరించి తెల్లటి పూలను చేత్తోపట్టుకొని నిరసన వ్యక్తం చేస్తున్నారు. కెర్రీ బిల్లును కేవలం కొన్నాళ్లు జాప్యం చేసేందుకే సస్పెండ్‌ చేశారని వీరు ఆరోపిస్తున్నారు. దీనికి తోడు ఆందోళనకారులపై పోలీసులు దాడి చేసినందుకు  చైనా అనుకూల హాంకాంగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కారీ లా మ్క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు.ఆందోళకారుల ఉద్యమం తీవ్రరూపం దాల్చడంతో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రజలకు క్షమాపణ చెప్పారు.

పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలనే డిమాండ్‌తో నాలుగేళ్ల క్రితం ఉధృతంగా సాగిన అంబ్రెల్లా ఉద్యమం.. ప్రభుత్వం ఎలాంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకుండానే ముగిసిపోయింది.ఏళ్లుగా ఊపిరి సలపకుండా చేస్తున్న చైనా నుంచి రక్షించుకునేందుకు ఇది తమకు చివరి అవకాశమని నిరసనకారులు చెబుతున్నారు.చైనాతో సహా ఇతర దేశాలకు నిందితులను అప్పగించే వివాదస్పద బిల్లుకు వ్యతిరేకంగా గత ఆదివారం సుమారు 10 లక్షల మంది నిరసన ర్యాలీలో పాల్గొన్నారు

hongkong
chief executive
APPOLOGY
city leader
protests
extradition bill
China
streets
Withdraw


మరిన్ని వార్తలు