పాక్ లో గురునానక్ ప్యాలెస్ ధ్వంసం

Submitted on 27 May 2019
Historical ‘Guru Nanak palace’ demolished in Pakistan

పాకిస్థాన్‌లో గురునాన‌క్ ప్యాలెస్‌ను గుర్తు తెలియని దుండ‌గులు కూల్చివేశారు. ప్ర‌తి సంవత్సరం వేలాది మంది సిక్కు ప‌ర్యాట‌కులు అక్క‌డ‌కు వెళ్లేవారు. గురు నానక్ అంటే సిక్కుల ఆరాధ్య దైవం. సిక్కు మతాన్ని స్థాపించి.. మానవత్వాన్ని ప్రబోధించారు ప్రపంచానికి గురు నానక్. సిక్కుల‌కు ఆరాధ్య దైవం గురునానక్. గురునాన‌క్ ప్యాలెస్ లో ఉన్న విలువైన కిటికీలు, డోర్ల‌ను కూడా అమ్ముకున్న‌ట్లు తెలుస్తోంది. పాకిస్థాన్‌లోని పంజాబ్ రాష్ట్రంలో ఈ ప్యాలెస్ ఉంది.

ఈ ప్యాలెస్ ను 400 ఏళ్ల క్రితమే నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. ఆ ప్యాలెస్‌లో సిక్కు ఆరాధ్య దైవం గురునాన‌క్‌తో పాటు కొంద‌రు హిందూ రాజుల చిత్రాప‌టాలు ఉన్నాయి. లాహోర్‌కు 100 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న నార్వాల్ నగరంలో ఈ ప్యాలెస్ ఉన్న‌ది. 16 పెద్ద పెద్ద గదులు, 4 వెంటిలేటర్లు ఉన్నాయి. ప్ర‌ధాని ఇమ్రాన్ ఈ విషయం పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు.  

దేశ విభజన తర్వాత రెండు దేశాల మధ్య ఉన్న ఉద్రిక్తతలు, దౌత్యపరమైన అంశాలతో గురునానక్ ప్యాలెస్ ను పట్టించుకునే వారు కరువయ్యారు. అయినా కూడా ఈ ప్యాలెస్ చూడటానికి లక్షల మంది సిక్కులు పాక్ వెళ్లి వస్తుంటారు. పర్వదినాల సమయంలో భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఈ ప్యాలెస్ ను గుర్తు తెలియని దుండగులు పూర్తిగా ధ్వంసం చేశారు. పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లోని సిక్కుల్లో ఈ అంశం ఆందోళన కలిగిస్తోంది.

Guru Nanak palace
demolished
Pakistan
2019

మరిన్ని వార్తలు