ఉన్నావ్‌లో హైటెన్షన్ : బీజేపీ నేతలను అడ్డుకున్న ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు

Submitted on 7 December 2019
High tension in unnav : NSUI activists blocked BJP leaders

ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన బీజేపీ నేతలను ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు అడ్డుకున్నారు. మంత్రులు వెనక్కి వెళ్లిపోవాలంటూ మంత్రుల కార్లను అడ్డుకోవడంతో ఉద్రిక్తతకు దారితీసింది. మోడీ సర్కార్‌ ముర్దాబాద్‌, మోది ప్రభుత్వం సిగ్గుపడాలి.. అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. దీంతో ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఉన్నావ్‌ ఘటనపై రాజకీయంగా తీవ్ర దుమారం చెలరేగడంతో యోగి ప్రభుత్వం స్పందించింది. బాధితురాలి కుటుంబాన్ని ఇద్దరు మంత్రులను ఉన్నావ్‌కు పంపింది. బాధితురాలు తన వాంగ్మూలంలో చెప్పిన నిందితులపై కఠినచర్యలు తీసుకుంటామని బీజేపీ నేతలు స్పష్టం చేశారు. బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయడానికే తాము ఇక్కడికి వచ్చామని చెప్పుకొచ్చారు

ఉత్తరప్రదేశ్‌లో మానవమృగాళ్ల చేతిలో అత్యాచారానికి గురైన బాధితురాలి కథ విషాదాంతమైంది. నిందితుల దాడిలో తీవ్ర గాయాల పాలైన బాధితురాలు ప్రాణాలతో పోరాడి ఓడింది. తనపై అత్యాచారం జరిగింది న్యాయం చేయండి అంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడమే తప్పయింది. ఆ కేసు విచారణ కోసం కోర్టుకు వెళ్లడమే నేరమైంది. 90 శాతం కాలిన గాయాలతో  ఆస్పత్రిలో చేరిన బాధితురాలు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది.
 

uttarpradesh
unnav
High Tension
NSUI
Activists
block
BJP leaders

మరిన్ని వార్తలు