
ఆర్టీసీ సమ్మె, రూట్ల ప్రైవేటీకరణపై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. నెల రోజుల దాటింది ఆర్టీసీ కార్మికులు సమ్మె చేపట్టి. ఈ విషయంపై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలో సోమవారం (నవంబర్ 11)న విచారణ చేపట్టిన ధర్మాసనం వాదనల సమయంలో కీలక వ్యాఖ్యలు చేసింది.
గంటల తరబడి కోర్టు సమయాన్ని వృథా చేస్తు ఒకే రకమైన వాదనల్ని చేస్తు విసిగిస్తున్నారంటూ కీలక వ్యాఖ్యలు చేసింది. ఆర్టీసీ సమ్మెను విరమింపజేసే అదికారం తీమకు ఉందా లేదా? ఒకవేళ కార్మికులు సమ్మె విరమించకుండా కొనసాగిస్తే..సమ్మె అక్రమమం అని తాము డిక్లేర్ చేయవచ్చా?అనే విషయాలను క్షుణ్ణంగా పరిశీలిస్తామని తెలిపింది.
ఈ సందర్బంగా కార్మికులు చేపట్టి కొనసాగిస్తున్న ఈ సమ్మె ఇన్ లీగల్ అని ఎవరు ప్రకటిస్తారు? ట్రిబ్యునలా? లేక ప్రభుత్వమా? లేదా కోర్టే అని కోర్టు ప్రశ్నించింది. సమ్మె ఇన్ లీగల్ అని ఎవరు నిర్ణయించాలనే విషయంపై మీ దగ్గర సమాధానం లేదు అని కోర్టు మందలించింది. చట్టాన్ని అతిక్రమించి తాము నిర్ణయం తీసుకోలేమని వ్యాఖ్యానించింది. రూట్ల ప్రైవేటీకరణ పిటీషన్ పై కూడా విచారణను హైకోర్టు వాయిదా వేసింది.