హీరో నిఖిల్ పెద్ద మనస్సు : 300ల మంది చిన్నారుల చదువు బాధ్యత నాదే

Submitted on 26 June 2019
Hero Nikhil is the hero in charge of education and Everything they need 300 Little Kids

యంగ్ హీరో నిఖిల్ పెద్ద మనస్సును చాటుకున్నాడు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 300లమంది చిన్నారులను చదివించే బాధ్యతను తీసుకున్నాడు. ఆప‌ద‌లో ఉన్న వారిని ఆదుకోవటంతో నిఖిల్ ఎప్పుడు ముందుంటారు. గతంలో ఇటువంటి ఎన్నో సహాయాలు చేసిన నిఖిల్ ఇప్పుడు 300 మంది విద్యార్ధుల చ‌దువుకి అయ్యే ఖ‌ర్చు అంతా తాను భ‌రిస్తాన‌ని ప్ర‌క‌టించాడు.

వీరందరికీ  స్కూల్   నుంచి చ‌దువు పూర్త‌య్యే వ‌ర‌కు అన్ని తానే చూసుకుంటాన‌ని నిఖిల్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా ప్రకటించాడు. ఇలాంటి మంచి అవకాశాన్ని తనకు వచ్చినందుకు సంతోషంగా ఉందని తెలిపాడు. భవిష్యత్తులో మరికొందరు చిన్నారుల అభివృద్ధికి తోడ్పతా’నంటు తెలిపారు. 

సెల‌క్టివ్‌గా సినిమాలు చేసుకుంటూ వెళుతున్న నిఖిల్ పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందినవాడు. ప్ర‌స్తుతం నిఖిల్ కార్తికేయ చిత్ర సీక్వెల్ కోసం స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నాడు. సినిమా విష‌యాల‌ని ప‌క్క‌న పెడితే నిఖిల్‌లో మంచి మాన‌వ‌త్వం కలిగినవాడు అని మ‌రోసారి వెల్లడయ్యింది. 
 

Hero
Nikhil
300 Little Kids
Education
Everything
need


మరిన్ని వార్తలు