తమిళ్ రాకర్స్.. జిందాబాద్

Submitted on 13 February 2019
Hero Heroine Teaser-10TV

నవీన్ చంద్ర, గాయత్రీ సురేష్, పూజా జవేరి హీరో, హీరోయిన్స్‌గా, అడ్డా ఫేం.. జీ.ఎస్. కార్తీక్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న సినిమా.. 'హీరో హీరోయిన్'. 'ఎ పైరేటెడ్ లవ్‌స్టోరీ' అనేది ట్యాగ్‌లైన్. స్వాతి పిక్చర్స్ బ్యానర్‌పై, భార్గవ్ మన్నె నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్ ఇటీవలే విడుదల చేసారు. గతకొద్ది రోజులుగా.. విడుదలకు ముందే పైరసీ అయిన సినిమాలు.. 1) అత్తారింటికి దారేది, 2) గీతగోవిందం, 3) టాక్సీవాలా.. 4) ? ఏంటో తెలుసుకోవాలంటే హీరో హీరోయిన్-టీజర్ చూడండి.. అని ప్రమోట్ చేస్తూ.. రీసెంట్‌గా టీజర్ రిలీజ్ చేసింది మూవీ యూనిట్.
నవీన్ చంద్ర పైరసీ చేస్తే, అతణ్ణి కొట్టడానికి సదరు హీరో అభిమానులు వచ్చి, మా ఎన్టీఆర్ సినిమా పైరసీ చేస్తా‌వ్‌రా? అనడిగితే.. నెక్స్ట్ వీక్, రామ్ చరణ్ సినిమా రిలీజవుతుంది.. ఇంకెక్కువ పైరసీ చేస్తా.. అని హీరో చెప్పడంతో స్టార్ట్ అయిన టీజర్.. పైరసీ చుట్టూ తిరిగింది.  ప్రతి మగాడూ ప్లే బాయే, ఛాన్స్ దొరికితే మేం కుక్కలమే.. అని హీరో, హీరోయిన్‌తో అంటే, నీ ప్రేమ కూడా పైరసీనే అని ఆమె అసహ్యించుకోవడం.. ప్రొడ్యూసర్ కూతురైతే ఏంటే.. నిన్నూ వదలను, పైరసీనీ వదలను.. అని హీరో చాలెంజ్ చెయ్యడం వంటివి టీజర్‌లో చూపించారు.

నవీన్ చంద్ర.. కాకినాడలో సీడీ షాప్ మెయింటెన్ చేస్తూ, కొత్త సినిమాలు పైరసీ చేస్తుంటాడు. అతనికి పీకే.. పైరసీ కింగ్ ఆఫ్ కాకినాడ.. అనే పేరు కూడా ఉంటుంది. అభిమన్యు సింగ్, కబీర్ సింగ్, జయప్రకాష్ రెడ్డి, సారిక రామచంద్రరావు తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి సంగీతం : అనూప్ రూబెన్స్, కెమెరా : వెంకట్ గంగాధరీ, ఎడిటింగ్ : జునైద్ సిద్ధికీ, ఫైట్స్ : రియల్ సతీష్.

వాచ్ టీజర్...

Naveen Chandra
Gayatri Suresh
Pooja Javeri
Bhargav Manne
GS Karthik

మరిన్ని వార్తలు