ఓటు వేసిన ప్రధాని తల్లి హీరాబెన్ 

Submitted on 23 April 2019
 Heeraben Modi, Prime Minister Narendra Modi's mother casts her vote at a polling station in Raisan, Ahmedabad

ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్‌ మోదీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అహ్మదాబాద్‌లోని రైసన్‌లోని ఓ పోలింగ్‌ బూత్‌లో ఆమె ఓటేశారు. ప్రధాని మోడీ తల్లి ఆశ్వీర్వాదం తీసుకున్న్ అనంతరం రనిప్ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. 

 

ఓటు వేసిన అనంతరం ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ఐఈడీ బాంబుల కన్నా.. ఓటరు ఐడీ అత్యంత శక్తివంతమైనందని వ్యాఖ్యానించిన విషయం విదితమే. ఉగ్రవాదులకు ఐఈడీ బాంబులే ఆయుధాలు అని, కానీ ప్రజాస్వామ్యానికి ఓటరు ఐడీయే శక్తి అని మోదీ పేర్కొన్నారు. కాగా గుజరాత్‌లో 26 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. కాగా లోక్ సభ మూడో విడత ఎన్నికల్లో భాగంగా పలు రాష్ట్రాల సీఎంలు..పార్టీ ప్రముఖులు తమ ఓటుహక్కుని వినియోగించుకుంటున్నారు. 

Heeraben Modi
PM
Narendra Modi's mothe
r casts
VOTE
Raisan
Ahmedabad

మరిన్ని వార్తలు