మెట్రో పనులు పూర్తయ్యాయి : జూబ్లీహిల్స్‌లో ట్రాఫిక్ రద్దీ

Submitted on 17 June 2019
Heavy Rush In Jubilee Hills Checkpost

జూబ్లీహిల్స్ ప్రాంతంలో ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతోంది. వాహనాలు బారులు తీరి నిలబడుతున్నాయి. జూబ్లీహిల్స్ నుంచి హైటెక్ సిటీ మార్గంలో ట్రాఫిక్ స్తంభించిపోయింది. పాదాచారులు, వాహనదారులు నానా అవస్థలు పడుతున్నారు. మెట్రో పనులు పూర్తి కావడంతో యదావిధిగా వాహనాలను జూబ్లిహిల్స్ చెక్ పోస్టు వైపుకు వన్ వే మార్గంలో వాహనాలను పంపించారు ట్రాఫిక్ పోలీసులు. 

ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించిపోతోంది. సిగ్నల్ పడడంతో వాహనాలు బారులు తీరి నిలిచిపోతున్నాయి. కార్యాలయాలకు, ఇతరత్ర పనులపై వెళ్లే వారు తీవ్ర అవస్థలు పడ్డారు. జూన్ 16వ తేదీ రాత్రి నుంచి వన్ వే మార్గంలో వాహనాలను అనుమతించారు. రాత్రి సమయం కావడంతో..అంతగా వాహనాల రద్దీ కనిపించలేదు. 

అయితే..జూన్ 17వ తేదీ సోమవారం ఉదయం నుండి ట్రాఫిక్ నిలిచిపోయింది. అమీర్ పేట నుంచి వచ్చే వాహనాలు, ఎల్వీ ప్రసాద్ - కేబీఆర్ పార్కు వైపు నుంచి, హైటెక్ సిటీ నుంచి వచ్చే వాహనాలు, ఫిల్మ్ నగర్ నుంచి వచ్చే వాహనాలతో రద్దీ నెలకొంది.

రెడ్ సిగ్నల్ పడగానే వాహనాలు బారులు తీరి నిలిచిపోతున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కార్యాలయాలు విడిచే టైంలో ఈ సమస్య అధికంగా ఉంది. మరి దీనిపై ట్రాఫిక్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. 

Heavy Rush
Jubilee Hills
checkpost
Hitech City
Jublihills Metro


మరిన్ని వార్తలు