పండుగ రద్దీతో కిటకిటలాడిన బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు

Submitted on 11 January 2019
Heavy rush at Bus stand,Railway Station for pongal

హైద‌రాబాద్: సంక్రాంతి పండుగ దగ్గర పడుతుండటంతో నగర వాసులుల తమ సొంత ఊళ్లకు బయల్దేరారు. దీంతో న‌గ‌రంలోని రైల్వే స్టేషన్, బస్టాండ్ లు  ప్రయాణీకులతో కిక్కిరిసిపోయాయి. శుక్రవారం నుంచి సెల‌వులు కావ‌డంతో సికింద్రాబాద్‌, నాంపల్లి రైల్వేస్టేషన్లతో పాటు జేబీఎస్‌, ఎంజీబీఎస్‌ ఆర్టీసీ బస్టాండ్ల నుంచి ప్రజలు తమ స్వగ్రామాలకు బయల్దేరి వెళ్తున్నారు. అలాగే ఉప్పల్ ఎల్బీనగర్ లలో ఏర్పాటు చేసిన ఆర్టీసీ  ప్రత్యేక బస్టాప్ లు కూడా ప్రయాణికుల రద్దీతో కళకళలాడాయి.
సంక్రాంతి పండుగ రద్దీ తట్టుకునేందుకు  టీఎస్ ఆర్టీసీ  హైదరాబాద్ నుంచి రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు 3,673, సీమాంధ్ర ప్రాంతానికి 1,579 ప్రత్యేక బస్సులు నడుపుతోంది.  ప్రయాణికుల రద్దీని తట్టుకునేందుక టీఎస్ ఆర్టీసి సిటీ బస్సులను కూడా కరీంనగర్‌, వ‌రంగ‌ల్‌, ఖ‌మ్మం, నిజామాబాద్‌, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాల‌కు నడుపుతోంది.
మరో వైపు స్వంత వాహానాలపై ఊళ్లకు బయలు దేరిన కార్ల తో హైదరాబాద్-కరీంనగర్, హైదరాబాద్-వరంగల్, హైద‌రాబాద్-విజ‌య‌వాడ‌ రహదారులపై ఉన్న టోల్‌ప్లాజాల ద‌గ్గ‌ర‌ విపరీతమైన రద్దీ నెలకొంది. కొన్ని టోల్‌ప్లాజాల వద్ద వాహనదారులకు ఇబ్బంది లేకుండా అదనపు కౌంటర్లు ఏర్పాటు చేశారు. 

pongal
rush
Railway Station
bus stand
toll plaza
villeges
Cars

మరిన్ని వార్తలు