చెల్లిని ముద్దాడాలనే సంకల్పమే.. ఇన్నాళ్లు బతికించింది

Submitted on 10 January 2019
Heartbreaking photo shows smile of dying boy who fought cancer long enough to meet baby sister

ఒకవైపు మృత్యువుతో పోరాడుతూనే మరోవైపు పుట్టబోయే తన చెల్లిని చూడాలనే తపన అతడిది. రోజురోజుకీ ఆయస్సు కొవ్వొత్తిలా కరిగిపోతుంటే.. పుట్టే తన చెల్లితో కలిసి ఆడుకోవాలనే ఆశ తొమ్మిదేళ్ల బాలుడిది. అతడే బెయిలీ కూపర్. తొమ్మిది ఏళ్ల వయస్సులోనే క్యాన్సర్ మహమ్మారి బాలుడి జీవితాన్ని చిదిమేసింది. కేన్సర్ వ్యాధితో ఎన్నోరోజులు బతకలేడని వైద్యులు చెప్పేశారు. పుట్టబోయే తనచెల్లితో కలిసి కాసేపు అయిన ఆడుకోవాలని కూపర్ ఆశ. 

చెల్లి పుట్టాకే చనిపోతా
మృత్యువు సమీపిస్తున్న లెక్క చేయలేదు. తన చెల్లి పుట్టాకే తాను ప్రాణాలు వదిలేస్తానని చెప్పాడు. అప్పటివరకూ బతికే ఉంటానని తల్లిదండ్రులకు మాట ఇచ్చాడు. అన్నట్టుగానే చెల్లి పుట్టేవరకు ప్రాణాలను బిగపట్టాడు. ఆ రోజు వచ్చేసింది. చెల్లి పుట్టింది. చిట్టి చెల్లిని చూసిన కూపర్ సంతోషపడ్డాడు. చివరికి తన చెల్లిని ముద్దాడి ఆడించి గత క్రిస్‌మస్‌ రోజున చనిపోయాడు. చిన్నారి చెల్లితో కూపర్ ఆడుకున్న ఆనంద క్షణాలను.. వారి తల్లిదండ్రులు కెమెరాలో షూట్ చేసి ఆ వీడియోను ఇంటర్ నెట్ లో పెట్టారు. అది చూసిన నెటిజన్లు అయ్యో పాపం అంటున్నారు. చిన్నారిని తన చేతుల్లోకి తీసుకుని కూపర్ మురిసిపోతున్న దృశ్యాలు హృదయాలను ద్రవింప చేస్తున్నాయి. గుండెల్ని పిండేసే ఆ వీడియో నెటిజన్లు కూడా కంటతడి పెట్టిస్తోంది. 

అప్పుడే తెలిసింది.. 
లండన్‌లో బెయిలీ కూపర్ కుటుంబం నివాసముంటోంది. ఓ రోజు బెయిలీ కూపర్ ఛాతీ నొప్పితో బాధపడుతుంటే డాక్టర్లకి చూపించారు. అది త్వరగానే తగ్గిపోతుందని అనుకున్నారు కానీ.. థర్ట్ స్టేజ్ క్యాన్సర్‌గా నిర్ధారించేసరికి ఆ ఫ్యామిలీలో విషాదం నెలకొంది. 2016నుంచి అలానే దశలవారీగా ట్రీట్‌మెంట్ ఇస్తున్నా ఫలితం లేకపోయింది. ఈ విషయం బెయిలీకీ తెలిసిపోయింది. మరణం అంటే ఏంటో కూడా సరిగా తెలియని పసి వయస్సు అతనిది. ఆ చిన్నవయసులోనే అతను వయసుని మించిన పరిణితితో వ్యవహరించేవాడట. ఆ సమయంలోనే తల్లి రాచెల్ మరో పాపకి జన్మనిచ్చింది. అప్పటికే బెయిలీ చివరిరోజులని డాక్టర్లు చెప్పినా.. బెయిలీ మాత్రం.. పాపని ఎత్తుకునేంతవరకూ బతికే ఉంటా అని చెప్పేవాడట. 

పేరెంట్స్ కు బెయిలీ కండిషన్స్ 
అలా 2017 నవంబర్‌లో పాప పుట్టింది. పాపకి మిల్లీ అని పేరు పెట్టారు. మిల్లీ పుట్టిన రోజు నుంచి బెయిలీ ఆమెతో గడిపాడట. పాప బట్టలు రోజూ అతడే మార్చేవాడు. స్నానం కూడా చేయించేవాడు. అన్నీ అతడే దగ్గరుండి చేసేవాడట. అలా మృత్యువుకి దగ్గరవుతూనే చెల్లికి దగ్గరగా చివరి రోజుల్లో గడిపాడు. కూపర్ చనిపోయే ముందు తన తల్లిదండ్రులకు ఓ మాట చెప్పాడు. తన అంత్యక్రియల విషయంలోనూ బెయిలీ ముందే తన తల్లిదండ్రులకు కొన్ని జాగ్రత్తలు చెప్పాడట. చనిపోయిన తర్వాత తనని చూడటానికి వచ్చేవాళ్లు సూపర్ హీరో డ్రస్‌లో రావాలన్నాడట. అలాగే ఎవరూ 20 నిమిషాలకు మించి ఏడవడానికి వీల్లేదని చెప్పాడట. అలానే తన గిఫ్ట్స్ అన్నీ.. అన్నకి ఇచ్చేయాలని చెప్పినట్టు కూపర్ తల్లిదండ్రులు వాపోయారు.  

Heartbreaking
dying boy
cancer
baby sister
Millie
Bailey Cooper

మరిన్ని వార్తలు