హెల్త్

ఆహారంలో అల్లం..దాల్చినలు ఉపయోగిస్తుంటారు. ఇవి ఉపయోగించడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. కొంతమంది వీటిని అంతగా ఉపయోగించారు. మరి అల్లం..దాల్చినలతో ఎలాంటి ఉపయోగాలున్నాయో చదవండి...
దాల్చిన చెక్కలో శక్తివంతమైన పోషకాలున్నాయి. మెదడు పనితీరును చురుగ్గా మారుస్తుంది. దాల్చిన చెక్క పొడి చేసుకుంటే ఆరు నెలల పాటు ఉంటుంది. మామాలు టీలోనూ కొద్దిగా కలుపుకుంటే ఆరోగ్యానికి మేలు....

ముల్తాని మట్టీ..సౌందర్యానికి వాడుతుంటారు. చర్మం పలు రకాలుగా ఉంటుంది. ఒకరికి పొడి చర్మ..మరొకరికి ఆయిల్ చర్మం ఇలా ఉంటుంది. ఈ ముల్తాని మట్టిని ఉపయోగించి వారు మరింత అందంగా తయారు కావచ్చు. ముల్తానీ మట్టి..తేనే..పసుపు..అన్నీ ఒక దగ్గర కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ గా వేసుకోవాలి. అనంతరం 20 నిమిషాల తరువాత చల్లని నీటితో కడుక్కోవాలి.
మూడు స్పూన్ల ముల్తాని మట్టీ..ఒక...

హెల్త్ : పట్టణాల్లో జీవించే కొందరికి ఎండ పొడ కూడ తగలదు ఎందుకంటే నగరాలల్లో ఎత్తైన భవనలు ఉండడం వలన సూర్యకాంతి అందిరి ఇళ్లకు ఉండదు. అంతేకాక కొంత మంది ఏసీల్లో రూమ్ ల్లో పని చేసి, ఏసీ కారులో ఇంటికి చేరడంతో వారికి ఎండ కరువు అవుతోంది. సూర్యకాంతి శరీరంపై పడకపోవడంతో చాల మందిలో డీ విటమిన్ లోపం ఏర్పడుతుంది. వ్యాధి నరోధక శక్తి పెంచే వాటిలో డీ విటమిన్ ఒకటి. దీన్ని...

ఆంధ్ర మాత గా పిలువబడే గోంగూర. తెలంగాణ లో కుంటి కూర అని కూడా పిలుస్తున్నారు. ఇది రెండు రకాలుగా మనకు మార్కెట్లో దొరుకుతుంది. ఎర్ర లేదా కొండ గోంగూర, తెల్ల గోంగూర. అందరూ ఎంతగానో ఇష్టపడే గోంగూర, రుచిలోనేగాక ఆరోగ్యపరంగా కూడా ఎంతో శ్రేష్టమైనది. గోంగూరలో ఉండే పీచు పదార్ధం మన గుండెకు ఎంతో మేలుచేస్తుంది.

గోంగూరలో విటమిన్ ఎ, బి1, బి9, సి పుష్కలంగా ఉంది. పొటాషియమ్‌, కాల్షియమ్‌,...

ఎండలు అప్పుడే మండిపోతున్నాయి. రానున్న రోజుల్లో భానుడు మరింత ఉగ్రరూపం దాల్చనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో ఎండ నుండి కాపాడుకొనేందుకు పలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎక్కువ మంది వడదెబ్బకు గురవుతుంటారు. శరీరంలో నీటి శాతం లోపించి బాడీ డీ హైడ్రేట్ అవుతుంది. జ్వరం..వాంతులు..విరేచనాలు..తల తిరగడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. శరీరంలోని లవణాలు చెమటరూపంలో...

ప్రతి రోజు ఎన్నో వస్తువులు..ఆహార పదార్థాలు ఉపయోగిస్తుంటాం. పనికి రావని మనం పాడేస్తుంటాం. కానీ బయటపాడేసే పదార్థాలతో చాలా ఉపయోగాలున్నాయి. మరి అవెంటో తెలుసుకోవాలంటే చదవండి...

  • చాలా మంది టిఫిన్..ఉదయం..రాత్రి వేళల్లో తింటుంటారు. అందులో ఇడ్లీ ప్రధానం. ఈ ఇడ్లీలు మిగిలితే పారేయకుండా ముక్కలుగా కట్ చేసుకుని నూనెలో దోరగా వేయించుకుని తిని చూడండి.
  • ...

హైదరాబాద్: అస్ట్రియో, రూమటాయిడ్ ఆర్థరైటిస్ తో బాధపడుతున్నారా? దానికి హోమియో పతి లో ఎలాంటి పరిష్కారాలు ఉన్నాయి? హోమియో కేర్ ఇంటర్నేషనల్ ను డా.సబిత సలహాలు సూచనలు ఇచ్చారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి.

ఉదయం లేవగానే ఏం చేస్తాం..ముఖం కడుక్కొని టీ..కాఫీ..గ్రీన్ టీ..పాలు తాగేస్తుంటారు. కానీ ప్రతి రోజు ఉదయం ఒక గ్లాస్ నిమ్మరసం తీసుకుంటే ఎంతో మేలు అని వైద్యులు పేర్కొంటుంటారు. గొరువెచ్చని నీటిలో కొంచెం నిమ్మరంస కలుపుకుని తాగితే ఎన్నో ప్రయోజనాలు దాగున్నాయని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే నిమ్మలో ఆల్కలైన్ లక్షణాలు కలిగి ఉండి శరీరంలోని టాక్సిన్స్ ను నిర్మూలిస్తాయి. వేడి నిమ్మరసం...

కూరగాయాల్లో ఆలుగడ్డ కూడా ఒకటి. ఈ గడ్డను తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు అని వైద్యులు పేర్కొంటున్నారు. ఫ్రై..కుర్మా..ఉడకబెట్టి తిన్నా..జ్యూస్ లాగా తాగిన ఆరోగ్యానికి మేలు అంట. గ్యాస్టిక్ మరియు ఎసిడిటి, అల్సర్ వంటి రోగాలను నయం చేస్తుందంట. కర్రీ చేయడం వలన కొన్ని ప్రోటీన్స్ పోతాయని, జ్యూస్ లాగా తీసుకుంటే మేలు అని పరిశోధనలు తెలియచేస్తున్నాయి.  క్యాన్సర్ తో పోరాడే శక్తిని కలిగి...

అధిక బరువుతో చాలా మంది బాధ పడుతుంటారు. బరువు తగ్గడం కోసం వ్యాయామాలు..హెల్త్ ఇనిస్టిట్యూట్స్ దగ్గరకు పరుగెడుతుంటారు. కానీ తినే ఆహారంలో మార్పులు చేసుకోరు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడమే కాకుండా కొన్ని రకాల పండ్లు తింటే బరువు అదుపులో ఉంటుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.

క్యారెట్ : బీటా కెరోటిన్స్..ఫైబర్ లు పుష్కలంగా లభిస్తాయి. ఇవి శరీరంలోకి ఫ్రీ...

దాల్చిన చెక్క..మసాల దినుసుల్లో ఇదొక రకం. దీనిని ఉపయోగించడం వల్ల ఎన్నో లాభాలు ఉంటాయన్న సంగతి తెలిసిందే. ప్రతి రోజు దాల్చిన చెక్క పొడి తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారని పరిశోధనలు చెబుతున్నాయంట. దాల్చిన చెక్క సహజ సిద్ధమైన ఔషధగుణాలను కలిగి ఉంటుంది. మరి దాల్చిన చెక్కలో ఎలాంటి ఔషధాలున్నాయో ..చూద్దాం..
బ్రేక్‌ ఫాస్ట్‌లో లేదా ఫ్రూట్స్‌, పెరుగు, ఓట్స్‌, గుడ్డు తినేటప్పుడూ...

ప్రస్తుతం ఉన్న జీవన విధానంలో చాలా మంది లావుగా ఉంటున్నారు. ఆధునిక ప్రపంచంలో చాలా ఉద్యోగాలు కూర్చుని చేసేవిగా ఉన్నాయి. ఎప్పుడు కూర్చోని పని చయడం వల్ల మానసికంగా మాత్రమే పని చేయగలము కానీ శరీరకంగా చేయలేము. అంతే కాక వెన్నుముక నొప్పి కూడా వచ్చే ప్రమాదం ఉంది. ఇటువంటి వారు రోజు 2 నుంచి 3 కిలోమీటర్లు నడవడం వల్ల శరీరానికి మంచి వ్యాయమం అవుతుంది. అంతేకాక మనం లిప్ట్ లో కాకుండా మెట్ల...

రోడ్డు పక్కన ఉండే బండ్లు..ఇతరత్రా ప్రాంతాల్లో విక్రయించే ఆహార పదార్థాలను అసలు భుజించవద్దని పెద్దలు చెబుతుంటారు. ఫలితంగా ఫుడ్ పాయిజనింగ్ అవుతుందని హెచ్చరిస్తుంటారు. కొంతమందికి ఫుడ్ పాయిజనింగ్ వల్ల పలు సమస్యలు ఎదుర్కొంటుంటారు. వాంతులు..వికారంతో చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఇలాంటి వారికి కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.

వికారంగా అనిపించే సమయంలో మూడు పూటలా ఒక స్పూన్...

బియ్యం పిండి..దీనితో పలు రకాల వంటకాలు..ఇతర వంటకాల్లో ఉపయోగించుకోవచ్చు. కానీ ఈ బియ్యం పిండితో అందాన్ని కూడా ఇనుమడింప చేసుకోవచ్చనే విషయం తెలుసా ? పిండిని వాడడం వల్ల చర్మానికి చాలా లాభాలు కలుగుతాయి. బియ్యం పిండి..ఓట్ మీట్..పాల పొడిలను తగినంత మోతాదులో కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పట్టిస్తే శరీర ఛాయలో మంచి మార్పు వస్తుంది. అంతేగాకుండా శరీరానికి మెరుపు వస్తుంది.
బియ్యం పిండి...

ఎండకాలం..అనగానే చర్మ సంబంధిత వ్యాధులు ముందుగా గుర్తకొస్తాయి. చర్మాన్ని రక్షించేందుకు పలువురు బ్యూటిపార్లర్లను ఆశ్రయిస్తుంటారు. మాయిశ్చరైజర్..కండీషనర్ లు అంటూ ఏవో రాసుకుంటూ ఉంటారు. ఇందులో రసాయనాల ప్రభావం చర్మంపై పడుతుందని తెలిసిందే. ఇలా కాకుండా సహజసిద్ధమైన నూనెలు రాసుకుంటే ఎలా ఉంటుంది ? కొన్ని చిట్కాలు..

  • కొబ్బరినూనె..ఇది మంచి యాంటీ ఆక్సిడెంట్...

కాకరకాయ, సోరకాయ (ఆనపకాయ), బీరకాయ, గుమ్మడికాయ, బూడిద గుమ్మడి, దోసకాయ పంటలు ప్రసిద్ధి. వీటికి వేడి వాతావరణం అనుకూలం. అధిక దిగుబడిని పొందడానికి నీరు నిల్వని తేలికపాటి బంకమట్టి నేలలు అనువైనవి. ఇక ఆనపకాయను సోరకాయ అని కూడా అంటారు. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనితో పలు రకాల వంటలు వండుకోచ్చనే సంగతి తెలిసిందే.

సోరకాయను ఆహారంలో భాగం చేసుకుంటే బరువు తగ్గే అవకాశం ఉంది...

తీపి పదార్థాలు అంటే చాలా మందికి ఇష్టమే. కానీ ఇష్టం కదా అని ఎక్కువగా తీసుకుంటే మాత్రం జర భద్రం అంటున్నారు వైద్యులు. ముఖ్యంగా పురుషులు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలంట. చక్కెర ఎక్కువగా తీసుకుంటే బుద్ధి మాంద్యం..మానసిక ఆందోళన.. లాంటి సమస్యలు వస్తాయంట. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ చేసిన ఓ అధ్యయనంలో ఈ విషయం బయటపడింది. తీపి పదార్థాలు ఎక్కువగా తీసుకునే వారిని అధ్యయనం చేయగా డయాబెటీస్...

ఎండాకాలంలో మామిడి పండ్లు.. శీతాకాలంలో జామ, నారింజ, బత్తాయిలు బాగా దొరుకుతాయి. ఈకాలంలో మాత్రం అల్ల నేరేడు పండ్లు విపరీతంగా లభిస్తాయి. తీపీ, పులుపూ, వగరు కలబోతగా నిగనిగలాడుతూ నోరూరించే నేరేడు ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోయే ఈ పండు పోషకాల గని.. అనారోగ్యాల ... ఆరోగ్యానికి మేలు చేయడమే కాదు.. కొన్నిరకాల రోగాలనూ నియంత్రించే శక్తి నేరేడు...

వెల్లుల్లిలో సల్ఫర్ పుష్క‌లంగా ఉంటుంది. స‌ల్ఫ‌ర్‌ రక్తనాళాల్లో గార (ప్లాక్) పేరుకుపోకుండా చూస్తుంది. ఆజోయేన్ రక్తం గడ్డ కట్టకుండా చేస్తుంది. దీనివ‌ల్ల గుండె జ‌బ్బులు రాకుండా ఉంటాయి. ఇందులోని అలిసిన్ రోగ‌కార‌క సూక్ష్మకిముల‌పై పోరాడుతుంది.
జ‌లుబు, శ్వాస‌కోస స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. వెల్లుల్లిని రోజూ తింటే శ‌రీరంలో ఉండే వాపులు, నొప్పులు త‌గ్గుతాయి. ఆలీల్...

ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఆరోగ్యం బాగా ఉండాలనే కొన్ని చిట్కాలు..మీ కోసం...

  • ఆహారం విషయంలో లోపం లేకుండా చూసుకోవాలి. 'జంక్ ఫుడ్'కి దూరంగా ఉండాలి. ప్రతిరోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.
  • పడుకొనే ముందు గోరువెచ్చని పాలు తాగడం మంచింది.
  • ఒక నిర్ధిష్ట వేళలో నిద్రపోవాలి.
  • ...

ఆహారంలో శ్రద్ధ వహించకపోతే శరీరంలో పలు పరిణామాలు చోటు చేసుకుంటుంటాయి. నిత్యం ఏదో ఒకరమైన అనారోగ్యంతో బాధ పడుతుంటుంటారు. ఆహారం విషయంలో కాస్త శ్రద్ధ వహించాల్సిందేనని నిపుణులు పేర్కొంటున్నారు. పౌష్టికాహారం తినడం వల్ల అనారోగ్య సమస్యల నుండి బయటపడే అవకాశం ఉంది.
క్యాలీ ఫ్లవర్ లో ఎక్కువగా మినరల్స్..విటమిన్స్..న్యూట్రీన్స్..యాంటి ఆక్సిడెంట్ లతో పాటు క్యాన్సర్ కణాలను నాశనం చేసే...

చిలకడ దుపం..ఈ దుంపలకు ఒక్కో ప్రదేశంలో ఒక్కో పేరుతో పిలుస్తారు. వీటిని మొరంగడ్డ, కందగడ్డ, స్వీట్ పొటాటో అని కూడా అంటారు. పిండి పదార్థాలను, చక్కెరలను కలిగి ఉండే ఈ ఆహార పదార్థం రుచిని కూడా కలిగి ఉంటుంది. ఇందులో ఉన్నన్ని అద్భుతమైన పోషకాలు ఇంకెందులోనూ ఉండవని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. చిలగడ దుంపలో శరీరానికి కావల్సిన పోషకపదార్థాలను అందించడంలోనే కాదు, వివిధ రకాలుగా శరీరంలో...

పాలు..బెల్లం అనేది గొప్ప కలయిక. రుచికరమైన మరియు కెలరీలు..ఐరన్..సోడియం, పొటాషియం తదితర విటమిన్స్ ఇందులో ఉంటాయి.

  •  
  • బెల్లంకు అనీమియా ఎదుర్కొనే శక్తి వుంది. మహిళలు ఐరన్ ట్యాబ్లెట్స్ బదులుగా బెల్లం కలిపిన పాలను వాడవచ్చు.
  • మహిళలకు రుతుక్రమంలో వచ్చే నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
  • ...

వ్యాయామం..ప్రతి మనిషికి ఇది అవసరం. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వ్యాయామం పట్ల అసలు దృష్టి సారించడం లేదు. ఉదయం మొదలుకొని రాత్రి పడుకొనే వరకు ఉరుకుల..పరుగులతో సాగుతోంది..ఇంకా వ్యాయామం చేసే టైం ఎక్కడి అని పలువురు నిట్టూర్పు విడుస్తుంటారు. కానీ ఈ పది వాస్తవాలు చదవండి..

  1. బరువు తగ్గించుకోవడానికి మాత్రమే వ్యాయామం అని అనుకోవద్దు.
  2. ...

అన్ వాంటెడ్ హేర్..ఈ సమస్యతో మహిళలు బాధ పడుతుంటారు. ఈ సమస్యతో బాధపడుతున్న వారు బయటకు వెళ్లాలంటేనే వెనుకంజ వేస్తుంటారు. దీనిని తొలగించుకోవడానికి పలు దారులు వెతుకుతుంటారు. ఈ సమస్య నుండి బయటపడాలంటే ఎలాంటి పరిష్కారాలున్నాయనే దానిపై చర్మవ్యాధి నిపుణులు శంకుతల తెలిపారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

చలికాలం వచ్చిదంటే చాలు చర్మం మొత్త పొడిపడం మొదలౌతుంది. బయటకి వేళ్లమంటే వాతావరణ కాలుష్యం వల్ల చర్మం పొడిబారి, పగిలి, నిర్జీవంగా మారిపోతుంది. మన చర్మల అలా మారుకుండా ఉండాలంటే క్రింది జాగ్రత్తలు తీసుకోవాలి.

బయటకు వెల్లివచ్చిన వెంటనే ముఖం, కాళ్లు, చేతుల్ని శుభ్రంగా కడగాలి. దీంతో పేరుకున్న దుమ్మూ, ధూళీ పోయి చర్మ శుభ్రపడుతుంది. తర్వాత తేనె, నిమ్మరసం, కొబ్బరినూనె తీసుకుని...

శరీరంపై పలువురు మచ్చలు వస్తుండడంతో పలు ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. ఇందుకు పలు మందులు..ఆరోగ్య సాధనాలను వాడుతుంటూ సమస్యలను మరిన్ని ఎదుర్కొంటున్నారు. మరి మచ్చలు పోవడానికి కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. కరివెపాకులను తీసుకుని చిటికెడు పసుపు వేయాలి. వీటిని మిక్సీ పట్టి మచ్చల పై ఈ మిశ్రమాన్ని రాసుకోవాలి. ఓ పదిహేను నిమిషాల అనంతరం కడిగేసుక్కోవాలి. ఎండిన తులసి..వేప..పుదీన ఆకులను...

వేసవికాలం వచ్చిందంటే చాలు మామిడికాయలతో మార్కెట్ కళకళలాడుతుంటుంది. బంగారం వర్ణంలో మెరిసే మామిడి పండ్లు అంటే ఎవరికైనా మక్కువే. మామిడి తినడం వల్ల పలు ప్రయోజనాలు కలిగి ఉంటాయి. మరి మామిడిలో ఏముంటాయి ? మామిడి పండు తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలిగి ఉంటాయో చూడండి..

  • మామిడిలో వంద క్యాలరీల శక్తి ఉంటుంది. ఒక గ్రాము ప్రోటీన్లు, 0.5 గ్రాముల కొవ్వులు, 25...

పుదీనా..ఎక్కువగా కూరల్లో వాడుతుంటారు. రుచికరంగా ఉండడంతో వీటిని ఆయా కూరల్లో వేస్తుంటారు. కానీ ఈ పుదీనాను ఔషధంగా కూడా ఉపయోగించుకోవచ్చు. కొన్ని రోగాలకు దీనిని ఉపయోగిస్తే చక్కటి పరిష్కారం లభిస్తుందంట.
నీరంగా ఉన్నట్లు అనిపిస్తే అరకప్పు పుదీనా రసంలో కొద్దిగానిమ్మరసం, రెండు స్పూనుల తేనెల కలుకుని తాగితే నయమవుతుంది. అంతేగాకుండా ఎసిడిటీతో ఇబ్బంది పడే వారు రోజుకో ఒక గ్లాసు...

సౌందర్యాన్ని ఇనుమడింప చేసుకోవాలని పలువురు మహిళలు బ్యూటీషియన్లను ఆశ్రయిస్తుంటారు. పలు మాస్క్ లు వేసుకుని అందాన్ని ద్విగుణీకృతం చేసుకొనేందుకు ప్రయత్నిస్తుంటారు. పండ్లు..కూరగాయాలతో మాస్క్ లు తయారు చేస్తుండడం తెలిసిందే. పచ్చి కొబ్బరితో కూడా మాస్క్ లు తయారు చేస్తుంటారు. ఈ మాస్క్ ను వేసుకోవడం ద్వారా చర్మం మృదువుగా..తాజాగా కనిపిస్తుంది.
ఎండకాలంలో వేడిమి నుండి...

ఇంట్లో అత్యంత ముఖ్యమైన భాగాల్లో వంటిల్లు కూడా ఒకటి. వంటిల్లు నుండే ఘుమఘుమలు వెళుతుంటాయి. కానీ వంట చేసే సమయం..ఇతరత్రా వాటిపై కొన్ని చిట్కాలు పాటిస్తే సమయం..శ్రమ రెండూ కలిసి వస్తాయి. అంతేగాకుండా ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందిస్తాయి.

  • ఐస్ క్రీమ్ కొని డీప్ ఫ్రీజ్ లో పెట్టడం వల్ల గడ్డ కడుతుంటే ఐస్ క్రీమ్ బాక్స్ ను ఓ కవర్ లో చుట్టి పెట్టి చూడండి..
  • ...

బతుకమ్మ...ఏదో పూలు తెచ్చి ఆడి..నిమజ్జనం చేయడం కాదు. ఇందులో ఆరోగ్య రహస్యం కూడ ఉందంట. తంగేడు, గునుగు, కట్ల, గుమ్మడి… తదితర పూలతో బతుకమ్మను పేరుస్తారు. పేర్చిన ఈ పూలల్లో ఔషద గుణాలున్నాయి. బతుకమ్మకు అందంతో పాటు..ఆడిన వారికి..ఇతరులకు ఆరోగ్యానిస్తాయి. అడవిలో పుట్టిన పూలను తెచ్చి ఓపికగా బతుకమ్మను పేర్చి..ఆడి పాడి చెరువుల్లో..బావుల్లో నిమజ్జనం చేస్తుంటారు. బతుకమ్మలను నిమజ్జనం చేయడం...

ఆషాడ మాసం వచ్చేసింది..ఈ మాసం వచ్చిదంటే చాలు ఆడవారి అరచేతుల్లో 'గోరింటాకు' మెరిసిపోతూ ఉంటుంది. ఆషాడంలో గ్రీష్మ రుతువు పూర్తి కావడంతో పాటు వర్ష రుతువు ప్రారంభం అవుతుంది. గోరింటాకు ఇష్టపడని మహిళలు చాలా అరుదుగా ఉంటారనే సంగతి తెలిసిందే. పండుగలు..శుభకార్యాల్లో మహిళలు తప్పకుండా గోరింటాకు పెట్టుకుంటారు. గ్రీష్మంలో శరీరం బాగా వేడి పెరుగుతుంది. ఆషాఢంలో మాత్రం వాతావరణం చల్లబడిపోతుంది...

హైదరాబాద్ : మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? ఆధునిక చికిత్స పద్దతుల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా... అయితే ఈ వీడియోను క్లిక్ చేయండి.

Pages

Don't Miss