హెల్త్

వంట గది..మహిళలు ఎక్కువ సమయం ఇక్కడనే కేటాయిస్తుంటారు. ఉదయం..మధ్యాహ్నం..రాత్రి సమయాల్లో ఇంటి వారికి కావాల్సిన వంటకాలు మహిళలు చేస్తుంటారు. వంట చేసే సమయాల్లో కొన్ని సమస్యలను ఎదుర్కొంటుంటారు. వంట గది శుభ్రంగా ఉంచుకోవడానికి పలు ప్రయత్నాలు చేస్తుంటారు. వంటగది..వంటల్లో నెలకొనే సమస్యల పరిష్కారానికి కొన్ని చిట్కాలు...

  • వంటగదిలో బొద్దింకలు..చీమలు ఎక్కువగా...
  • బియ్యం ఉడికే సమయంలో రెండు చుక్కల నిమ్మరసం వేస్తే అన్నం తెల్లగా వస్తుంది.
  • అంతేగాకుండా అన్నం పొడిపొడిగా రావడానికి ఉడికే సమయంలో కాస్త నూనె వేస్తే పొడిపొడిగా వస్తుంది.
  • క్యాబేజీ కూరలో పచ్చివాసన పోవడం కోసం పలు ప్రయత్నాలు చేస్తుంటారు. పచ్చివాసన పోవాలంటే ఉడుకుతుండగా ఒక బ్రెడ్ ముక్కను వేయాలి.
  • ...

మంచినీరు..ఆరోగ్యానికి మంచిది. చాలా మంది నీరు ఎక్కువ సేవించకపోవడం వల్ల పలు అనారోగ్యాలకు గురవుతుంటారు. ముఖ్యంగా వేసవికాలంలో ఈ సమస్య అధికంగా ఉంటుంది. చెమట రూపంలో నీరు బయటకు వెళ్లే సరికి డీ హైడ్రేషన్ తో బాధ పడుతుంటారు. కొంతమంది నీళ్ల తాగే విషయంలో జాగ్రత్తలు పాటించరు. మరి నీళ్లు ఎప్పుడెప్పుడు తాగాలి..
పగటి వేళ రెండున్నర లీటర్ల నీరు తాగితే ఆరోగ్యానికి మంచిదని వైద్యులు...

కూరగాయాల్లో కందగడ్డ ఒక రకం. దీనితో పలు రకాల వంటలు చేస్తుంటారు. ఇది చాలా బలవ్ధకమైన ఆహారం. ఇందులో పలు పోషక విలువలు, ఔషధ గుణాలున్నాయి. బీటా కెరోటీన్ చాలా తక్కువగా ఉంటుంది. దీనిని తినడం వల్ల షుగర్..ఒబిసిటీలను అదుపులో ఉంచవచ్చు. కందగడ్డలో విటమిన్ ఎ చాలా ఎక్కువగా ఉంటుంది. లోగ్లిజమిక్ ఇండెక్స్, బ్లడ్ షుగర్ లెవల్స్ పెరగకుండా క్రమబద్దం చేస్తుంటుంది. రెడ్ బ్లడ్ సెల్స్ ఏర్పడటానికి...

వర్షాకాలం ముగుస్తోంది..చలికాలం ప్రవేశించబోతోంది..ఈ సమయంలోనే రోగాలు కూడా ప్రవేశిస్తాయి..జలుబు..జ్వరం..దగ్గు..ఇతర వ్యాధులు ప్రబలుతుంటాయి. వైరస్..బ్యాక్టీరియాలు సోకితే శరీరంలోని రోగనిరోధక శక్తి బలహీన పడుతుంది. అందువల్ల బొంగురు గొంతు, తరచూ తుమ్ముల్లు, దగ్గు, కండరాలు పట్టుకోవడం తదితర సమస్యలు ఏర్పడుతాయి. మలేరియా, డెంగీ, టైఫాయిడ్, హెపటైటిస్ ఎ ఇతరత్రా వ్యాధులు వస్తాయి.

దొమలు...

చిట్టి రాగులు తీసుకుంటే ఎన్నో లాభాలు కలుగుతాయి. క్యాల్షియం..ఐరన్ వంటి పోషకాలు ఇందులో దండిగా లభిస్తాయి. మధుమేహులకు..పూబకాయలకు రాగులు మంచిగా పనిచేస్తాయి. ఎందుకంటే ఇవి నెమ్మదిగా జీర్ణమవుతాయి. శరీరానికి అవసరమైన ట్రిప్టోథాన్, వాలైన్, మెధియోనైన్, ఐసోల్యూసిస్, ధ్రియోనైన్ వంటి ఆమైనా ఆమ్లాలు కూడా ఉంటాయి.

  • మధుమేహం నియంత్రణకు రాగుల్లోని ఫైటో కెమికల్స్...

కాకరకాయ..కూరగాయాల్లో ఒక రకం. దీనితో వంటలతో పాటు అందానికి కూడా ఉపయోగించుకోవచ్చు. అంతేగాకుండా మంచి ఔషధం కూడా పనిచేస్తుంది. కరివేపాకును పొడి చేసుకోవాలి..అలాగే కాకరకాయను పేస్ట్‌గా చేసుకుని ఈ రెండూ మిశ్రమాలను కలుపుకుని చర్మంపై రాసుకోవాలి. కొద్దిసేపటి తర్వాత నీళ్లతో శుభ్రం చేసుకుంటే దురద తగ్గిపోతుంది. కాకరకాయలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ మొటిమలను నివారిస్తుంది. కాకరకాయను మెత్తగా...

హెల్త్ : మనకు సహజంగా లభించే పండ్లు, కూరగాయలు, దంపలు, పంటలతో ఆర్యోగానికి ఎంతో మేలు చేస్తాయి. అందులో ఒక్కటి నువ్వులు నువ్వులతో శరీరానికి మంచి పోషన లభిస్తుంది. నువ్వుల నూనెలో కొవ్వు తక్కువగా ఉంటుంది కాబట్టి వంటలో వాడుకోవడం చాలా మంచిది. అంతేకాదు చాలా మంది స్త్రీలకు నెలసరి సరిగ్గాలేక ఇబ్బంది పడుతుంటారు. దీనికి కారణం హర్మోన్లు బ్యాలెన్సింగా లేకపోవడం. హర్మోన్లు...

వయస్సు ఏదైనా కండరాల నొప్పులతో బాధ పడుతున్నారు. మారుతున్న జీవన శైలికి దీనికి ముఖ్య కారణమని చెప్పవచ్చు. నడుం..కండరాల నొప్పుల నుండి విముక్తి పొందాలంటే కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుందని వైద్యులు పేర్కొంటున్నారు.

  • బరువైన వస్తువులను ఎత్తే సమయంలో చేతులతో కాకుండా యంత్రాలతో ఎత్తడం మంచిది. ప్రమాదాలను అరికట్టడమే కాకుండా నొప్పులు రాకుండా ఉంటుంది.
  • ...

దుంపలు..ఈ దుంపల్లో చిలగడ దుంపలు ఒకటి. ఉడకబెట్టి..నిప్పులపై కాల్చుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది. ఆహారంగానే కాకుండా దీనిని చర్మ సౌందర్యం కాపాడుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. ఇందులో ఫైబర్, విటమిన్లు ఎ,సి,డి, కాల్షియం, పొటాషియం, ఐరన్‌లు పుష్కలంగా లభిస్తాయి. వీటిని తినడం వల్ల కళ్లకు ఎంతో మేలు జరుగుతుంది. శరీరానికి కావాల్సిన పోషకాలను అందించడంతో పాటు విష పదార్థాలను తొలగిస్తుంది....

హిందు సంప్రదాయం ప్రకారం రోజు తులసి చెట్టుకు పూజ చేస్తాం. కానీ తులసి వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో చాలా మందికి తెలియదు. తులసిలో అనేక రకాల ఔషధ గుణాలున్నాయి. రోజుకు ఒక తులసి ఆకు తినడం వల్ల రక్తం శుభ్రపడుతుంది. దాంతో చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. తులసిలో ఉండే యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ మచ్చలను తొలగిస్తుంది. ఎండిన తులసి ఆకు పొడితో పళ్లు తొముకుంటే నోటి దుర్వాసన పోవడమే కాకుండా...

ఎండకాలం వచ్చేస్తోంది. శివరాత్రికి చలి..శివ..శివ..అంటూ వెళ్లిపోతుందని పెద్దలు పేర్కొంటారు. వేసవికాలంలో ఉష్ణోగ్రతలు అధికం కావడంతో చాలా మంది డీ హైడ్రేషన్ కు గురవుతుంటారు. చాలా మంది చల్లగా ఉండటానికని మార్కెట్లో దొరికే శీతలపానీయాలు సేవిస్తుంటారు. కానీ ప్రకృతి నుండి లభించిన 'కొబ్బరి బొండాం' అయితే బెటర్ అని పలువురు సూచిస్తున్నారు. ఈ కొబ్బరి బొండాం సేవించడం వల్ల పలు ప్రయోజనాలు...

పుచ్చకాయలో ఉండే లైకోపీస్ గుండె..చర్మ సంబంధిత వ్యాధుల నుండి కాపాడుతుంది. సపోటా పళ్లు మలబద్ధకాన్ని నివారిస్తాయి. అనాసపళ్లలో బ్రొమిలిస్ అనే ఎంజైమ్ ఉండడం వల్ల వాపులను తగ్గిస్తుంది. ఉల్లిపాయ శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తాయి. పచ్చిజామకాయలో ఉండు టానిస్ మాలిక్ ఆమ్లాలు దుర్వాసనను పొగొడుతాయి. టమాటలో ప్రొస్టైట్ క్యానసర్ సోకకుండా అడ్డుకుంటుంది. సంత్రా పండు తినడం వల్ల న్యుమోనియా వ్యాధి...

తాలింపు దినుసుల్లో ముఖ్యమైంది జీలకర్ర. జీలకర్ర దినుసు మాత్రమే కాదు.. దివ్యౌషధం. ఆహారానికి మంచి రుచిని, సువాసనను ఇచ్చే జీలకర్రను చాలా మంది ఇష్టపడతారు. దాని వల్ల కలిగే మేలు ఏంటో ఎప్పుడయినా ఆలోచించారా.. లేదంటే మాత్రం ఇది చదవాల్సిందే.

జీలకర్రలో యాంటీ ఆక్సిడెంట్లు అధికం. అవి శరరీంలో రోగనిరోధకశక్తిని పెంచుతాయి. వ్యర్థాలను బయటకు పంపుతాయి. ఈ కాలంలో చిన్నారులకు తినిపించే...

సన్నని చినుకులు పడుతూ.. ఆహ్లాదకరమైన వాతావరంలో తినేందుకు ఎంతో రుచిక‌రంగా ఉండే మొక్క‌జొన్న అంటే దాదాపుగా అంద‌రికీ ఇష్ట‌మే. ఉడ‌క‌బెట్టినా, నిప్పుల‌పై కాల్చుకుని తిన్నా మొక్కజొన్న రుచే వేరబ్బా.. ఈ సీజ‌న్‌లో మొక్క‌జొన్న ఎక్కువ‌గా ల‌భిస్తుంది. అయితే మొక్కజొన్న‌ను త‌ర‌చూ తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి ప్ర‌యోజ‌నాలో తెలుసుకుందా..

 

మొక్కజొన్నలో పుష్కలంగా ఉండే థైమీన్...

ప్రతి మనిషి రోజులో ఎంత కష్టపడిన అతనికి కొంత సేపు విశ్రాంతి అవసరం. మనిషి ఒక పుట తినకుండా ఉంటే ఏం కాదు కాని నిద్ర పోకపోతే ఆరోగ్యానికి హానికరం. మనిషికి రోజుకు కనీసం6 నుంచి 7 గంటలు నిద్ర అవసరం. కాని చాలా మంది తమ జీవన విధానంలో నిద్రకు కేవలం 4నుంచి 5 గంటలు కేటాయిస్తున్నారు. దీనికి కారణాలు చాలానే ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న యువతియువకులు మంచంపైకి వెళ్లగానే మొబైల్ ఫోన్లలో చాటింగ్...

హైదరాబాద్ : ఆధునియ యుగంలో ప్రతొక్కరూ ఆరోగ్యంపై దృష్టి పెట్టకపోవడం వల్ల దేశంలో బీపీ, షుగర్ రోగులు అధికమౌతున్నారని ప్రముఖ వైద్యులు గోపాలం శివనారాయణ పేర్కొన్నారు. జిందాబాద్ సంస్థ ఆధ్వర్యంలో బీపీ, షుగర్ పేషేంట్ల కోసం అంబేద్కర్ కాలేజీలో ఏర్పాటు చేసిన రెగ్యులర్ శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన టెన్ టివితో మాట్లాడారు. రోజురోజుకు పెరిగిపోతున్న ఆధునిక...

వంటకాలకు రుచి, వాసన రావాలంటే కొతిమీర ఆ వంటల్లో కొతిమీర ఆకు వేయాల్సిందే. చూడడానికి సున్నితంగా, మంచి లేత ఆకుపచ్చని రంగు మంచి వాసనతో ఇట్లే ఆకర్షిస్తుంది కొతిమీర ఆకులు. ప్రతినిత్యం మనం వంటకాలలో వాడే కొతిమీర వల్ల ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసుకుందాం.

కొత్తిమీరలో పొటాషియం, ఇనుము, విటమిన్ ఎ, కె మరియు C, ఫోలిక్ యాసిడ్, మెగ్నీషియం మరియు కాల్షియం అధికంగా ఉన్నాయి. దీనికి ఉన్న...

ఎండాకాలం వచ్చేసింది. దీనితో ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదురుకానున్నాయి. ఎండల వల్ల డీ హైడ్రేషన్ తో పాటు చర్మ సంబంధిత రోగాలు వచ్చే అవకాశాలున్నాయి. దీనితో ఎండకాలం నుండి తప్పించుకోవడానికి పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అందులో ప్రధానమైంది తాజా పండ్ల రసాలను తీసుకోవడం. క్యారెట్..బీట్ రూట్..దానిమ్మ..సంత్రా..ఇలా పండ్ల రసాలను తీసుకోవడం వల్ల ఆరోగ్యం మేలుగా ఉంటుంది. ఆరెంజ్ జ్యూస్ లో...

ఎండకాలంలో శరీరం..చర్మానికి పలు సమస్యలు ఏర్పడుతుంటాయి. చర్మం కమలడంతో పాటు ఇతర రోగాలు దరిచేరుతుంటాయి. చర్మం పొడిబారి నిర్జీవంగా కనిపిస్తుంది. ఇలా కాకుండా ఉండాలంటే చల్లటి ఫేస్ ప్యాక్ లను ఉపయోగిస్తే సరిపోతుంది.
తేనె..దొసకాయలను తీసుకోవాలి. ఇవి మాయిశ్చరైజర్లుగా పనిచేస్తాయి. దోసకాయ రసం తీసుకుని అందులో రెండు చెంచాల తేనె కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి 30 నిమిషాలు...

నిద్ర..మనిషికి ఎంతో ముఖ్యం..ఆలోచనలు..కష్టాలు మరిచిపోతూ నిద్ర పోతుంటారు. ఆరు గంటల నిద్ర అవసరమని వైద్యులు సూచిస్తుంటారు. నిద్రలేమి కారణంగా ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయని వైద్యులు సూచిస్తుంటారు. ప్రపంచంలో ఏ మనిషి అయినా నిద్ర పోవాల్సిందే. నిద్ర ఎవరికైనా ప్రశాంతతను అందిస్తుంది. కానీ ఓ వ్యక్తి మాత్రం నిద్ర పోతే చనిపోతాడంట. ఓ అరుదైన వ్యాధితో బాధ పడుతున్న వ్యక్తికి సంబంధించిన...

శీతాకాలం రాగానే పెదవులపై తడి అరి పగలడం ప్రారంభమౌతుంది. అలా కాకుండ ఉండలంటే ఏముంది వ్యాసిలెన్ లేక లిప్ కేర్ పెడితే సరిపోతుందని చాలా మంది అనుకుంటారు. కానీ అవి అన్ని కృత్రిమ పద్ధతలు. సహజంగా పెదవులు తాజాగా ఉండాలంటే చెంచా చొప్పున తేనె, చక్కెర, బాదంనూనె పెదవులకు రాసుకోవాలి. కొన్ని గులాబీ రేకుల్ని తీసుకుని వాటిని ముద్దలా చేసి అందులో కాస్త బాదం నూనె వేయాలి. తర్వాత పెదవులకు పూతలా...

ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పలు రకాల ఆకు కూరల్లో వివిధ పోషకాలు లభ్యమౌతుంటాయి. అలాంటి ఆకు కూరల్లో పొన్నంగంటి కూడా ఒకటి. ఇందులో విటమిన్ ఏ, బి 6, సి, ఫొలేట్, రైబో ఫ్లెవిన్, పొటాషియం, ఇనుము, మెగ్నీషియం వంటివి పుష్కలంగా లభిస్తాయి. ఆహారంలో దీనిని భాగం చేసుకుంటే ఎన్నో లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా కంటి చూపుకు ఎంతో దోహదం చేస్తుంటుంది. గంటల కొద్దీ కంప్యూటర్ల ముందు కూర్చునే...

శరీరంలో అన్ని భాగాలు ముఖ్యమే. అందులో వెన్ను కూడా ఒకటి. శరీరానికి ఊతమిచ్చే కీలకమైన భాగం అని పేర్కొన్నవచ్చు.ఇది 33 వెన్నుపూసలతో ఉంటుంది. మనం వంగినా లేచినా వెన్నుపూసల మధ్యలో ఉండే డిస్క్ లు సహాయపడతాయి. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి వరకు ఏదో ఒక పని చేస్తూ బిజి బిజీగా గడిపేస్తుంటారు. దీనితో శరీరంలోని పలు అవయావాలపై ప్రభావం చూపిస్తాయి. అందులో వెన్ను ముక ఒకటి. పలు సందర్భాల్లో వెన్ను...

మీకు వేళకు ఆకలి అవుతుందా ? జీర్ణశక్తి బాగానే ఉందా ? బాగానే ఉంది అంటే..ఒకే..కానీ లేదు అంటే మంచి ఆరోగ్య సూచన కాదు. ఆకలని పట్టించుకోకపోవడం..వేళకు తినకపోవడం..వేళ మించాక తినడం వల్ల పలు అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. మరి ఆకలి విషయంలో పాటించాల్సిన ఆరోగ్య సూచనలు ఏంటీ ?
ఆకలి పెరిగి పోయే వరకు ఆగకండి..అలాగే ఆకలి వేయగానే వెంటనే తినయకండి. క్రమం తప్పకుండా ఒకే సమయంలో తినడం...

వానాకాలం వచ్చేసింది. వానాకాలంతో పాటు అంటురోగాలు కూడా వచ్చేస్తుంటాయి. వైరల్ ఫీవర్..ఎలర్జీలు ఈ కాలంలోనే అధికంగా వస్తుంటాయి. మరి అనారోగ్యాల బారిన పడకుండా ఉండాలంటే కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈకాలంలో కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగడం మేలు. అల్లం..లెమన్..హెర్బల్ టీలను తాగడం మంచిది. ఆకుకూరలు..ఎలాంటి కూరగాయాలైనా శుభ్రంగా కడుక్కొని వాడడం బాగుంటుంది...

హెల్త్ : పట్టణాల్లో జీవించే కొందరికి ఎండ పొడ కూడ తగలదు ఎందుకంటే నగరాలల్లో ఎత్తైన భవనలు ఉండడం వలన సూర్యకాంతి అందిరి ఇళ్లకు ఉండదు. అంతేకాక కొంత మంది ఏసీల్లో రూమ్ ల్లో పని చేసి, ఏసీ కారులో ఇంటికి చేరడంతో వారికి ఎండ కరువు అవుతోంది. సూర్యకాంతి శరీరంపై పడకపోవడంతో చాల మందిలో డీ విటమిన్ లోపం ఏర్పడుతుంది. వ్యాధి నరోధక శక్తి పెంచే వాటిలో డీ విటమిన్ ఒకటి. దీన్ని...

మానసికంగా ఎంత ఆరోగ్యంగా ఉంటేనే అంత శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు. ఎప్పుడైతే మానసిక ఆందోళన మొదలవుతుందో అప్పటి నుండే అనేక సమస్యలు వస్తుంటాయి. వీటిని సైకోస్మోటిక్ డిజార్డర్స్ అంటారు. కొన్ని శ్వాస సంబంధిత వ్యాధులు కూడా దీనికి కిందకే వస్తాయి. నిత్యం మనం ఎదుర్కొనే టెన్షన్ నుండి గట్టెక్కాలంటే మానసిక ప్రశాంత అవసరం. ఈ ప్రశాంత మందులు షాప్ లో దొరకవు..డబ్బులతో కొనేది కాదు. విపరీతమైన కోపం...

ఆహారపు అలవాట్లు..జీవన శైలిలో మార్పులు తీసుకుంటే చక్కటి ఆరోగ్యం మీ సొంతం అంటున్నారు వైద్యులు.

  1. ప్రతి రోజు పచ్చి కూరగాయల రసం తాగితే అనారోగ్యాల బారి నుండి కాపాడుకోవచ్చు. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
  2. యోగా..వ్యాయామం..ధాన్యం..లాంటి ప్రక్రియలతో మానసిక వత్తిడిని దూరం కావచ్చు.
  3. కుటుంబసభ్యులు.....

చేపదుంపలు..కూరగాయాల్లో ఒక రకం. కేవలం ఇది రుచికోసమే కాకుండా పోషకాలు కూడా అందిస్తుంది. వేపుడు..పులుసు పెట్టుకొంటే దీని టేస్ట్ వేరేగా ఉంటుంది. కానీ ఇది తినడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. బరువు తగ్గాలనుకొనే వారు చేమ దుంపలకు అధిక ప్రాధాన్యతనివ్వండి. కొవ్వు శాతం తక్కువగా ఉంమే కాకుండా సోడియం శాతం కూడా తక్కువే.

  • కొలెస్ట్రాల్ అసలు ఉండదు. హృద్యోగాలు...

ఆడవారు..మగవారికి జుట్టు ఉంటేనే అందం. కొంతమందికి జుట్టు రాలిపోతుండడంతో పలు సమస్యలను ఎదుర్కొంటుంటారు. మొదట్లో జట్టు అందంగా..ఒత్తుగా ఉండేందుకు...కుంకుడు కాయలను ఉపయోగించే వారు. ప్రస్తుతం షాంపూలు అందుబాటులోకి రావడంతో కుంకుడుకాయలను మరిచిపోతున్నారు. కానీ కుంకుడుకాయలు ఉపయోగించడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు దాగున్నాయి.
రెండు టీ స్పూన్స్‌ చొప్పున కుంకుడుకాయ, ఉసిరి పొడులు..మరో...

దుంప కూరల్లో కందగడ్డ రుచికి మరొకటి లేదు. అడవులలో తిరిగే మునులు “కందమూలాలు” తిని బతికేవారని పురాణాలు మనకు తెలుపుతున్నాయి. చూపులకు అందంగా కనిపించకపోయినా కంద వంటకాలన్నీ ఎంతో రుచిగా ఉంటాయి. కంద దుంప చాలా బలమైన ఆహారం. ఈ దుంప తింటే షుగర్, ఒబిసిటీలను అదుపులో ఉంచుకోవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇందులో విటమిన్ ‘ఎ’ చాలా ఎక్కువ మోతాదులో ఉంటుంది. కందలో పొటాషియం, ఫైబర్ నేచురల్...

మహిళలు అవాంఛిత రోమాలతో బాధ పడుతుంటారు. ఈ సమస్య నుండి బయటపడటానికి చాలా డబ్బును కూడా ఖర్చు చేస్తుంటారు. కానీ కొన్ని చిట్కాలతో అవాంఛిత రోమాల నుండి బయటపడవచ్చని పలువురు సూచిస్తున్నారు. తిరిగి పెరుగుతున్న జుట్టు నుండి సహజ రెమెడీలున్నాయి. బొప్పాయి..శనగపిండి..పసుపు మూడు పదార్థాలను కలుపుకోవాలి. అవాంఛిత రోమాలున్న చోట రాసి స్నానం చేయాలి. అలోవెరా..శనగపిండి కూడా సహాయ పడుతుంది. ఎందుకంటే...

కొంతమంది కడుపు ఉబ్బరంగా ఉండడం అనిపిస్తుంటుంది. ఈ సమయాల్లో ఏవో మందులు వేసుకుని సరిపుచ్చుకుంటుంటారు. కానీ కొన్ని చిట్కాలు పాటిస్తే కడుపు ఉబ్బరం సమస్య నుండి బయటపడొచ్చు.
పిప్పళ్లు బాగా దంచి చూర్ణం వేసి దానిలో అరస్పూన్ చూర్ణానికి ఒక స్పూన్ నూనె కలిపి రోజు మూడు పూటలా వాడాలి.
జీలకర్రను నీటిలో వేసి రసం తీయాలి. ఆ రసాన్ని ప్రతి రోజూ మూడుపూటలా ఒక స్పూన్ చొప్పున తీసుకోవాలి...

ప్రకృతి ప్రసాదించిన వరాల్లో సహజ సిద్ధమైన ఔషధం 'తేనె' ఒకటి..చక్కెర తియ్యగా ఉంటుంది. కానీ ఆరోగ్యానికి హానికరం. తేనె కూడా తియ్యగానే ఉంటుంది. కానీ ఔషధభరితం. ఎందుకంటే పూలల్లోని మకరందం, పుప్పొడి పరిమళం కలగలిసిన అద్భుతమైన రుచి దీని సొంతం. అందుకే తేనె మధురాతి మధురం... అమృతాన్ని మరిపించే దివ్యౌషధం. అనాదినుంచి కూడా వాడుకలో ఉంది. శిలాయుగం చివర్లోనే అడవి తేనె సేకరణ జరిగిందని...

Pages

Don't Miss