వీడని వివాదం: హార్దిక్ పాండ్యాకు మరో షాక్!

Submitted on 15 January 2019
Hardik Pandya loses Khar Gymkhana honorary membership for Koffee with Karan controversy
  • ఖార్ జింఖానా గౌరవ సభ్యత్వం నుంచి తొలగింపు

  • కాఫీ విత్ కరన్ వివాదంతో చిక్కుల్లో పాండ్య 

భారత ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యకు మరో షాక్ తగిలింది. ముంబైలోని ప్రసిద్ధ స్పోర్ట్స్ క్లబ్ ఖార్ జింఖానా మూడేళ్ల గౌరవ సభ్యుత్వం నుంచి పాండ్యను తొలగించారు. ఇటీవల కాఫీ విత్ కరన్ అనే టీవీ షోలో హార్దిక్ మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం వివాదస్పదానికి దారితీసిన సంగతి తెలిసిందే. తన వ్యాఖ్యలపై వెంటనే పాండ్య క్షమాపణలు, వివరణ ఇచ్చుకున్నప్పటికీ కేఎల్ రాహుల్ సహా ఇద్దరిపై బీసీసీఐ వేటు వేసింది. దీంతో ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్ లో వీరిద్దరూ ఆడే అవకాశాన్ని చేజార్చుకున్నారు.

మహిళలపై పాండ్య చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఖార్ జింఖానా స్పోర్ట్స్ క్లబ్ నిర్వహించే సోషల్ మీడియా పేజీపై 4వేల మంది సభ్యులు ఉన్నారు. ఇందులో ప్రత్యేకించి మహిళా సభ్యులు పాండ్య వ్యాఖ్యలను తీవ్రంగా వ్యతిరేకించారు. దీనిపై మేనేజింగ్ కమిటీ సమావేశం నిర్వహించి పాండ్య మూడేళ్ల సభ్యుత్వాన్ని తొలగించాలనే నిర్ణయం తీసుకున్నట్టు క్లబ్ ప్రధాన కార్యదర్శి గురవ్ కపాడియా వెల్లడించారు. 

ఖార్ జింఖానా గౌరవ సభ్యుత్వాన్ని గత ఏడాది అక్టోబర్ నెలలో పాండ్యకు ఇచ్చినట్టు ఆయన తెలిపారు. క్రీడాకారులకు ఇచ్చే ఖార్ జింఖానా క్లబ్ గౌరవ సభ్యుత్వాన్ని గతంలో సచిన్ టెండూల్కర్, లియాండర్ పేస్, మహేశ్ భూపతి, సైనా మీర్జా, సైనా నెహ్వాల్ చాలామందికి బహుకరించారు. కాఫీ విత్ కరన్ వివాదంతో గిల్లెట్ యాజమాన్యంతో స్పాన్సర్ షిప్ ఒప్పందాన్ని కూడా పాండ్య కోల్పోయిన సంగతి విదితమే. భారత యువ క్రికెటర్లలో ప్రస్తుతం హార్దిక్ పాండ్యా చేతిలో ఏడువరకు స్పాన్సర్ షిప్ కాంట్రాక్టులు ఉన్నాయి. 

Hardik Pandya
Khar Gymkhana
honorary membership
Koffee with Karan    

మరిన్ని వార్తలు