షాకిచ్చిన బీసీసీఐ : హర్దీక్, రాహుల్ పై వేటు

Submitted on 11 January 2019
Hardik Pandya, KL Rahul suspended pending inquiry over Koffee with Karan row

నోరు బాగుంటే.. ఊరు బాగుంటది అంటారు. ఒకసారి నోరు జారితే తిరిగి తీసుకోలేం. దాని పరిణామలు కూడా ఊహించలేం. కొన్నిసార్లు నోటి దూల కారణంగా భారీ మూల్యాన్ని చెల్లించక తప్పదు. నోటికి వచ్చినట్టు మాట్లాడితే నోటి దూల తీర్చేస్తుందనడానికి భారత క్రికెటర్లు హర్దిక్ పాండ్య, కేఎల్ రాహుల్ అందుకు ప్రత్యక్ష ఉదాహరణ. ఇటీవల కాఫీ విత్ కరన్ అనే పాపులర్ హిందీ టీవీ షోలో వీరిద్దరూ మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. సరదా కోసం మాట్లాడిన మాటల వల్ల భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది. చక్కని క్రికెటర్ కెరీర్ ను చేతులారా పాడుచేసుకున్నారు. మహిళలపై అనవసర వ్యాఖ్యలు చేసినందుకు పాండ్య, రాహుల్ పై బీసీసీఐ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 

వీరిద్దరిపై సస్పెన్షన్ వేటు వేసింది. ‘‘పాండ్య, రాహుల్ ఇద్దరిపై సస్పెన్షన్ వేటు వేశాం. విచారణ పెండింగ్ లో ఉంది’’ అని సీఓఏ చీఫ్ వినోద్ రాయ్ మీడియాకు వెల్లడించారు. ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా ఈ నెల 12న జరుగబోయే మూడు వన్డేల మ్యాచ్ కు ఇద్దరు క్రికెటర్లు పాండ్య, రాహుల్ ను సెలెక్టర్లు ఎంపిక చేయలేదు. దీంతో వీరి స్థానంలో రిషబ్ పంత్, మనీష్ పాండే చోటు దక్కించుకునే అవకాశం ఉంది. 

వివాదాస్పద వ్యాఖ్యలపై ఇటీవలే బీసీసీఐ రాహుల్, పాండ్యకు 24 గంటల్లోగా వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసులు జారీచేసిన సంగతి విదితమే. దీనిపై పాండ్య, రాహుల్ ఇచ్చిన వివరణతో సీఓఏ సంతృప్తి చెందలేదు. దీంతో వీరిద్దరికి రెండు మ్యాచ్ ల వన్డేలపై నిషేధం విధించాలని రాయ్ సీఓఏకు సిఫార్స్ చేశారు. 

Hardik Pandya
KL Rahul
pending inquiry
Koffee with Karan Show
BCCI
Vinod Rai

మరిన్ని వార్తలు