సిగ్గు చేటు : కులం పేరుతో వేధింపులు..మహిళా డాక్టర్ ఆత్మహత్య

Submitted on 25 May 2019
Harassed by seniors over caste, Mumbai BVS Nair Hospital doctor commits suicide

కులం..కులం..కులం. ఓ వైపు టెక్నాలజీ దూసుకుపోతుంటే మరోవైపు కులాల పేరుతో వేధింపులు. ఉన్నత చదువులలో రాణిస్తున్నవారు సైతం ఈ కులం పేరుతో వేధింపులకు పాల్పడుతున్న హేయమైన ఘటనలు జరుగుతున్నాయి. ప్రాణాలు పోయాల్సిన డాక్టర్లే తోటి మహిళా డాక్టర్ ను కులం పేరుతో వేధించారు. దీనితో ఆ డాక్టర్ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన ముంబైలో చోటుచేసుకుంది.

ముంబయి సెంట్రల్‌లో పాయల్‌ సల్మాన్‌ తాడ్వి అనే 26 ఏళ్ల యువతి గైనకాలజి విభాగంలో పోస్టు గ్రాడ్యూయేషన్‌ చేస్తోంది. బీవైఎస్‌ నాయర్‌ ఆస్పత్రిలో డాక్టర్ గా పని చేస్తోంది. హేమా ఆహుజా, భక్తి మహిరా, అంకిత కండేవాల్‌ అనే ముగ్గురు సీనియర్ డాక్టర్లు తరచూ కులం పేరుతో పాయల్‌ను వేధింపులకు గురిచేసేవారు.

వేధింపులు తీవ్రస్థాయికి చేరుకోవటంతో మనస్తాపానికి గురైన పాయల్..హాస్టల్‌ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు హాస్టల్ చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వేధింపులపై ఆస్పత్రి వర్గాలకు ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని సమాచారం. వేధింపులకు పాల్పడిన ముగ్గురు సీనియర్‌ వైద్యులు హేమా ఆహుజా, భక్తి మహిరా, అంకిత కండేవాల్‌లపై పోలీసులు కేసు నమోదు చేశారు ముంబై పోలీసులు.

Mumbai
BVS Nair Hospital
Doctor
Payal Salman Tadvi
commits suicideHarassed by seniors over caste

మరిన్ని వార్తలు