వాలెంటైన్స్ డే స్పెషల్ : ఫిబ్రవరి 8 ' ప్రపోజ్ డే '

Submitted on 8 February 2019
Happy Propose Day 2019

ప్రేమికుల దినోత్సవం రాబోతున్నది. అందరూ ఫిబ్రవరి 14వ తేదీనే అనుకుంటారు. కాదండీ.. వారం అంతా కూడా ప్రేమికులకు పండగే. 14వ తేదీకి సరిగ్గా వారం నుంచి రోజుకో డేను.. ప్రేమికులు రోజుకో రకంగా సెలబ్రేట్ చేసుకుంటారు. నిన్నటికి నిన్న అంటే ఫిబ్రవరి 7వ తేదీని రోజ్ డే (గులాబీ పువ్వు దినం)గా జరుపుకుంటే.. ఫిబ్రవరి 8వ తేదీని ప్రపోజ్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు లవర్స్. ‘ప్రేమ’ మాటలకు అందని అనుభూతి. అనుభవిస్తేనే కాని తెలియని ఓ అద్భుతం. ఆ ప్రేమ ఎప్పుడు పుడుతుంది? ఎలా పుడుతుంది చెప్పలేం. అలాంటి ప్రేమను ఆస్వాదించే ప్రేమికులకు ఎంతో మధురమైన వారం ఈ వాలంటైన్స్ డే దినోత్సవాలు.

ఫిబ్రవరి 14న వచ్చే వాలంటైన్స్ డేకి ముందు 7 రోజుల సంబురాలు ఇలా ఉంటాయి :
- ఫిబ్రవరి 7 ' రోజ్ డే '
- ఫిబ్రవరి 8 ' ప్రపోజ్ డే '
- ఫిబ్రవరి 9 ' చాక్లెట్ డే '
- ఫిబ్రవరి 10 ' టెడ్డీ డే '
- ఫిబ్రవరి 11 ' ప్రామిస్ డే '
- ఫిబ్రవరి 12 ' హగ్ డే '
- ఫిబ్రవరి 13 ' కిస్ డే '
- ఫిబ్రవరి 14 ' చివరిగా వాలంటైన్స్ డే'

ఇలా ఈ వీక్ లో ముందు ఏడు రోజులు ప్రేమికులు ప్రేమ వేడుకలు జరుపుకుంటారు. రోజ్ డే తో మోదలై కిస్ డే తో ముగుస్తుంది. తర్వాత ఫిబ్రవరి 14న వాలంటైన్స్ డే జరుపుకుంటారు.

వాలెంటైన్ వీక్ లో రెండో రోజు ప్రపోజ్ డే చాలా మంది ప్రేమికులకు ఇది ఎంతో విలువైన రోజు. ఈరోజు.. ప్రేమించే వ్యక్తి హృదయంలోని మాటను తెలిపే వారందరికీ గోల్డెన్ చాన్స్. "నేను నిన్ను ప్రేమిస్తాను" అనే ఒక్క మాట కోసం ఎన్నో అవకాశాల్లో వెనకాడి.. మరో అవకాశం కోసం ఎదురుచూస్తున్న వారందరికీ మాంచి టైమ్. 

సో.. ప్రేమించే వ్యక్తికి తన ప్రేమను చాలా బాగా ప్రపోజ్ చేయాలని.. జీవితంలో మరిచిపోలేని విధంగా ఉండాలని.. చాలా మంది ప్రేమికులు అనుకుంటూ ఉంటారు. కానీ ఎలా? ప్రేమను తెలపడం అంత సులభమా? అంటే కాదనే చెప్పాలి. ప్రపోజ్ చేయడం ద్వారా ప్రేమించే వ్యక్తిని సంతృప్తిపరచడం అంత సులభం కాదు. అందుకే ప్రపోజ్ డే నాడు లవ్ ప్రపోజ్ చేసే ప్రేమికుల కోసం కొన్ని మెసేజ్‌లు, కోట్స్, వాట్సాప్ స్టేటస్‌లను ఇక్కడ అందిస్తున్నాం. ఇవి మీకు ఉపయోగపడతాయో లేదో చూడండి! ఈ రోజు మీ ప్రేమను చెప్పడానికి మీరు ప్రేమించే వ్యక్తికి ఇలా ప్రపోజ్ చేయండి. 

 

- There are many love stories in this world, but ours is the sweetest. It is sweet because you are in the love story. Will you be with me forever?

- On This Special Day I Want To Say, Grow Old long With Me, The Best is Yet To Be. Will You Spend The Rest Of Your Life With Me? Happy Propose Day!

- I give you all my love 
I promise to stay forever. 

- No poems 
No fancy words 
Just my true feelings 
For you, my love 
Happy Propose Day... 

Valentines Day
Happy Propose Day
2019

మరిన్ని వార్తలు