కాంబో కుదిరిందా?

Submitted on 25 May 2019
Hanu Raghavapudi Next Movie With Vijay Devarakonda

టాలీవుడ్ యంగ్  సెన్సేషనల్ హీరో విజయ్‌ దేవరకొండ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. సినిమాకీ సినిమాకీ మధ్య పెద్ద గ్యాప్ తీసుకోవడం లేదు.. ఇప్పటికే 'డియర్‌ కామ్రేడ్' షూటింగ్ పూర్తి చేసిన విజయ్‌, ప్రస్తుతం క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్నాడు. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే తమిళ దర్శకుడు ఆనంద్‌ అన్నామలై దర్శకత్వంలో 'హీరో' చిత్రాన్ని ఇటీవల ప్రారంభించాడు. డియర్ కామ్రేడ్, హీరో సినిమాలను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థే నిర్మిస్తుంది.

తాజాగా ప్రేమకథల స్పెషలిస్ట్‌గా పేరు తెచ్చుకున్నయంగ్ డైరెక్టర్ హను రాఘవపూడి కూడా విజయ్‌ కోసం ఓ కథ రాస్తున్నట్టు తెలుస్తుంది. అందాల రాక్షసి, కృష్ణగాడి వీర ప్రేమగాధ, లై, పడి పడి లేచె మనసు సినిమాలతో ఆడియన్స్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు హను.. తను ప్రస్తుతం విజయ్ కోసం ఓ ప్రేమ కథని సిద్ధం చేసాడని, కథ నచ్చడంతో విజయ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ఫిలింనగర్ సమాచారం. విజయ్ నటించిన ‘డియర్‌ కామ్రేడ్‌’ జూలై 26న రిలీజ్ కానుంది.

Hanu Raghavapudi
Vijay Devarakonda
New Movie
2019

మరిన్ని వార్తలు