వరల్డ్ కప్‌లో ఒత్తిడిని కంట్రోల్ చేయడమే ముఖ్యం: కోహ్లీ

Submitted on 21 May 2019
Handling pressure most important thing, says Kohli

ఇంగ్లాండ్ వేదికగా మే30 నుంచి జరగనున్న వరల్డ్ కప్‌కు టీమిండియా సిద్ధమైంది. అంతర్జాతీయ టోర్నీకి ముందు జరిగే వార్మప్ మ్యాచ్‌లలో ఆడేందుకు ఇంగ్లాండ్‌కు మే22న బయల్దేరనుంది. ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో కోచ్ రవిశాస్త్రితో పాటు కెప్టెన్ విరాట్ కోహ్లీ పాల్గొన్నాడు. 

'వరల్డ్ కప్‌లో అంచనాలు అందుకోవడానికి సాధ్యమైనంత మంచి క్రికెట్ ఆడేందుకు ప్రయత్నిస్తాం. మా ఫోకస్ అంతా దానిపైనే ఉంటుంది. అందుకే మాకు అనుకూలంగా ఫలితాలు రాబట్టగలుగుతున్నాం. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే ఒత్తిడిని హ్యాండిల్ చేయడమే. అనవసరమైన పరిస్థితులకు తగ్గట్లు స్పందించాలి. మా బౌలర్లు అంతా ఫ్రెష్ ఎనర్జీతో ఉన్నారు. ఎవ్వరిలోనూ నీరసం కనిపించడం లేదు'

'బౌలింగ్ యూనిట్‌లో యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్ రెండు స్తంభాలు లాంటి వాళ్లు. పర్సనల్‌గా ఫార్మాట్ రీత్యా ఈ వరల్డ్ కప్ చాలెంజింగ్ వరల్డ్ కప్‌గా ఫీలవుతున్నా' అని తెలిపాడు. మే30నుంచి మొదలుకానున్న ఈ టోర్నీ జూలై 14వరకూ అంటే 46రోజుల పాటు జరగనుంది. భారత్ తన తొలి మ్యాచ్‌ను దక్షిణాఫ్రికాతో జూన్ 5న తలపడనుంది. 

kohli
Virat Kohli
2019 icc world cup
world cup 2019
2019 Cricket World Cup
ICC WORLD CUP 2019

మరిన్ని వార్తలు