హఫీజ్ కు రిలీఫ్...ఆరోపణల నమోదులో పాక్ విఫలం

Submitted on 7 December 2019
Hafiz Saeed gets brief breather in terror financing trial, next hearing on December 11

ముంబై ఉగ్రదాడుల సూత్రధారి, నిషేధిత ఉగ్రసంస్థ జమాత్ ఉద్ దవా(JUD)చీఫ్ హఫీజ్ సయీద్‌పై ఆరోపణల నమోదుకు తగిన పరిస్థితులు కల్పించడంలో పాకిస్థాన్ అధికారులు విఫలమయ్యారు.  లాహోర్‌లోని యాంటీ టెర్రరిజం కోర్టులోశనివారం(డిసెంబర్-7,2019)జరిగిన టెర్రర్ ఫైనాన్సింగ్ కేసు విచారణకు హఫీజ్ సహ నిందితుడు మాలిక్ జఫర్ ఇక్బాల్‌ను అధికారులు హాజరుపరచలేకపోయారు. దీంతో కోర్టు తదుపరి విచారణను ఈ నెల 11కు వాయిదా వేసింది. 
 
టెర్రర్ ఫైనాన్సింగ్ కేసులో నిషేధిత జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్‌, మాలిక్ జఫర్ ఇక్బాల్ నిందితులుగా ఉన్నారు. పాకిస్థాన్‌లోని పంజాబ్ పోలీసు శాఖలో కౌంటర్ టెర్రరిజం డిపార్ట్‌మెంట్ ఈ కేసును దాఖలు చేసింది. ఈ కేసులో ఆరోపణలను శనివారం నమోదు చేయవలసి ఉంది. కానీ ఆశ్చర్యకరంగా మాలిక్‌ను కోర్టుకు హాజరుపరచడంలో అధికారులు విఫలమయ్యారు. దీంతో విచారణను ఈ నెల 11కు వాయిదా వేశారు. హ

ఫీజ్ సయీద్‌ను కట్టుదిట్టమైన భద్రత నడుమ లాహోర్‌లోని కోట్ లఖ్‌పత్ జైలు నుంచి తీసుకొచ్చి, కోర్టులో హాజరుపరిచారు. కోర్టు వ్యవహారాలను రిపోర్ట్ చేసేందుకు విలేకర్లకు అనుమతి ఇవ్వలేదు. పాకిస్తాన్ లో హఫీజ్ స్వేచ్ఛగా తిరుగుతున్నాడని,పాకిస్తాన్ ఆతిధ్యాన్ని ఎంజాయ్ చేస్తున్నాడని తమ దగ్గర సమాచారముందని బారత్ వ్యాఖ్యానించిన ఒక్కరోజు తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది.
 

Hafiz Saeed
brief breather
terror financing
Trial
next hearing
December 11

మరిన్ని వార్తలు