జర్నలిస్టు హత్య కేసు : డేరా బాబాకు జీవిత ఖైదు 

Submitted on 17 January 2019
Gurmeet Baba's life imprisonment in Journalist's murder case

హర్యానా : 16 ఏళ్ల జర్నలిస్టు హత్య కేసులో పంచకుల సీబీఐ ప్రత్యేక కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ హత్య కేసులో కోర్టు గుర్మీత్ బాబాకు జీవిత ఖైదు శిక్ష విధించింది. 50 వేల రూపాయల జరిమానా కూడా విధించింది. డేరా బాబా గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ తోపాటు మరో ముగ్గురిని కోర్టు దోషులుగా ఖరారు చేసింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు విచారణ జరిపింది. ఈ కేసులో డేరాబాబాతోపాటు నిర్మల్, కుల్ దీప్, కృష్ణలాల్ లను కోర్టు దోషులుగా ప్రకటించింది. ఇద్దరి సాదీలపై అత్యాచారం కేసులో డేరాబాబాకు ఇరవై ఏళ్ల జైలు శిక్ష పడిన విషయం తెలిసిందే. పంజాబ్, హర్యానాలో 144 సెక్షన్ విధించారు. పంచకుల కోర్టు వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

2002 లో జర్నలిస్టు రామచంద్ర ఛత్రపతి హత్య జరిగింది. రామచంద్ర ఛత్రపతి హత్య కేసులో నిందితులుగా గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్, నిర్మల్, కుల్ దీప్, కృష్ణలాల్ ఉన్నారు. డేరా ప్రధాన కార్యాలయంలో మహిళలపై లైంగిక వేధింపులు, అత్యాచారాలపై ’పూర సచ్’ పత్రికలో ఛత్రపతి ప్రత్యేక సంచికను ప్రచురించారు. దీని తర్వాత 2003లో జర్నలిస్టు ఛత్రపతి హత్య గావించబడ్డారు. 2003 లో పోలీసులు కేసు నమోదు చేసి, 2006 లో కేసును సీబీఐకి అప్పగించారు. ఇటీవల డేరా బాబాకు 20 ఏళ్ల శిక్ష విధించిన తర్వాత పోలీసులు కేసు విచారణను వేగవంతం చేశారు. 

తీర్పు వెలువరించిన తర్వాత పంజాబ్, హర్యానాలో హైఅలర్ట్ ప్రకటించారు. రెండు రాష్ట్రాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భారీగా భద్రతా బలగాలను మోహరించారు. పంజాబ్ లో డేరా బాబా అనుచరులు ఎక్కువగా ఉన్న చోట భారీగా భద్రతను కట్టుదిట్టం చేశారు. డేరా బాబా ప్రధాన కార్యాలయం, డేరా బాబా అనుచరులు ఎక్కువగా  ఉండే చోట భద్రతను పెంచారు. డేరా అనుచరులు ఎలాంటి అల్లర్లు సృష్టించకుండా ముందస్తుగా భద్రత పెంచామని పోలీసు అధికారులు చెబుతున్నారు. 
 

Gurmeet Baba
life imprisonment
panchakula
CBI SPECIAL COURT
Journalist chatrapati murder case

మరిన్ని వార్తలు