సైకిల్ యూనివర్సిటీ: పెట్రోల్, డీజిల్ వాహనాలు బంద్

Submitted on 6 February 2019
gujarath university banned motor vehicles

కొద్ది రోజుల క్రితం గుజరాత్ ప్రభుత్వం విద్యకు ఆటంకం కలుగుతుందంటూ ప్రైమరీ స్కూల్స్‌లో మొబైల్ గేమ్ పబ్జీని రద్దు చేసింది. ఇప్పుడు గుజరాత్‌లోని ఫారుల్ యూనివర్సిటీ విద్యార్థుల చదువును దృష్టిలో పెట్టుకుని ఆరోగ్యవంతమైన నిర్ణయం తీసుకుంది. కాలుష్యరహితంగానే కాకుండా విద్యార్థులు, లెక్చరర్లు ఫిట్‌గా ఉండాలని ఆ యూనివర్సిటీ పరిధిలో పెట్రోల్, డీజిల్ వాహనాలను నడపకూడదంటూ ఆంక్షలు జారీ చేసింది. ఒకవేళ యూనివర్సీటి క్యాంపస్ పరిధిలో ట్రాన్స్‌పోర్ట్ చేయాల్సి వస్తే సైకిళ్లను వినియోగించాలని సూచించింది. 

ఇందులో భాగంగా తొలి దశలో 100 సైకిళ్లను అందుబాటులో తీసుకొచ్చింది. 120 ఎకరాల్లో ఉన్న యూనివర్సిటీ క్యాంపస్ మొత్తంలో నాలుగు సైకిల్ స్టాండ్లను ఏర్పాటు చేసింది. విద్యార్థులకు అనుకూలంగా ఉండేందుకు సైకిళ్లను అద్దెకు ఇచ్చేలా కూడా ఏర్పాట్లు చేశారట. 

గతేడాది యూనివర్సిటీ శివారు గ్రామంలో పెళ్లికూతురు ఇంటికి వచ్చే పెళ్లికొడుకు సైకిల్‌పైనే వెళ్లాలనే ఓ నియమాన్ని కూడా అమలు చేశారు. నగర వ్యాప్తంగా స్కూటర్లు, మోటారు వెహికల్ల వినియోగం తగ్గించాలనే అవగాహన కార్యక్రమంలో భాగంగా జరిగిందే ఈ సైకిల్ ప్రయోగం. 

parul university
bandh

మరిన్ని వార్తలు