ఘోర రోడ్డు ప్రమాదం : ఆటో-లారీ ఢీ.. ఏడుగురు మృతి

Submitted on 15 July 2019
Gujarat Road Accident

గుజరాత్ రాష్ట్రంలోని కచ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో-లారీ ఢీకొన్న ఘటనలో ఏడుగురు చనిపోయారు. 10మంది గాయపడ్డారు. మాంకువా దగ్గర ఈ ప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టంకి తరలించారు. 
Also Read : మిస్టరీ ఏంటీ : శివాలయంలో రక్తంతో శివుడికి అభిషేకం

ఈ ప్రమాదంలో ఆటో నుజ్జునుజ్జు అయ్యింది. ఆటోలో ప్రయాణిస్తున్న వారు ప్రాణాలు కోల్పోయారు. మృతదేహాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఆ ప్రాంతం చూడటానికి చాలా భయానకంగా ఉంది. ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది. ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్పారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సమాచారం.
Also Read : వణుకుపుట్టించే వీడియో : భీకర పోరాటం.. మొసలిని మింగేసిన కొండచిలువ

Gujarat
road accident
auto
Truck
mankuwa
KUTCH

మరిన్ని వార్తలు