స్కూల్ బ్యాగ్‌ల భారం పోయింది : నెలకొక బుక్‌ చాలు

Submitted on 10 January 2019
This Gujarat Principal Has A Brilliant Solution For Kids Carrying Heavy School Bags

స్కూల్ పిల్లలకు అతిపెద్ద కష్టం స్కూల్ బ్యాగ్ లను మోయడమే. ఎల్ కేజీ చదువు నుంచే కిలోల కొద్దీ బరువులుండే స్కూల్ బ్యాగ్ లను ప్రస్తుతం చిన్నారులు మోస్తున్నారు.  చిన్నారులు బండెడు పుస్తకాలను చిన్న వయస్సులో మోయడంపై పలువురు విద్యావేత్తలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

చిన్నారులు అధిక బరువుండే స్కూల్ బ్యాగ్ లు మోయకూడదని చిల్డ్రన్స్ స్కూల్ బ్యాగ్స్(లిమిటేషన్ ఆఫ్ వెయిట్) 2016 బిల్లు ఉన్నప్పటికీ స్కూల్ మేనేజ్ మెంట్ లు కానీ, పేరెంట్స్ కానీ చిన్నారుల విషయం కనికరం చూపటం లేదు. అధిక బరువు ఉండే బ్యాగ్ లను ఉదయం మోస్తూ చిన్నపిల్లలు చిన్నవయస్సులోనే బాగా అలసటకు గురౌతున్నారు. నేటి రోజుల్లో ఒకటో తరగతి చదివే పిల్లలు కూడా అతిగా చదవడం వల్ల దృష్టిలోపం కోల్పోయి కళ్లజోళ్లు వాడుతున్నారు. 


రోజూ చిన్నారులు  కిలోల బరువుండే స్కూల్ బ్యాగ్ లు  మోసే పనిలేకుండా గుజరాత్ లోని ఓ స్కూల్ ప్రిన్సిపల్ ఓ కొత్త సొల్యూషన్ తో ముందుకొచ్చాడు. అహ్మదాబాద్ లోని భగద్ గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్ లో ప్రిన్సిపల్ గా పనిచేస్తున్న  ఆనంద్ కుమార్ కలస్(41) సిలబస్ పేజీలను పది బుక్స్ గా మార్చి, ఒక్కో బుక్ ఒక్కో నెల స్టడీస్ కవర్ చేసే విధంగా చేశారు. దీంతో నెల మొత్తం విద్యార్థులు ఒక్క బుక్ తో స్కూల్ కి రావచ్చు. కిలోల కొద్దీ పుస్తకాలు ఉండే బ్యాగ్ ను తన కూతురు కూడా మోసేదని, ఓ రోజు తన బ్యాగ్ ని మోయడంతో అసలు ఇంత బరువుండే బ్యాగ్ ను తను ఎలా మోస్తుందని ఆలోచించానని, ఈ ఘటన తనను ఇలా ఆలోచించేలా చేసినట్లు ప్రిన్సిపల్ ఆనంద్ కుమార్ తెలిపారు. మిగతా స్కూళ్లు కూడా ఆనంద్ కుమార్ లా ఆలోచించి విద్యార్థుల వీపులపై భారం తగ్గించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.

SCHOOL BAGS
HEAVY
Gujarat
PRINCIPAL
SOLUTION
ONE BOOK

మరిన్ని వార్తలు