బారాత్ లో డ్యాన్స్ చేస్తూ వరుడు మృతి

Submitted on 15 February 2020
Groom dies while dancing in his marriage barat

నిజామాబాద్ జిల్లా బోధన్ లో పెళ్లింట విషాదం నెలకొంది. వివాహమైన కొద్దిగంటల్లోనే వరుడు మృతి చెందాడు. బారాత్ లో డీజే సౌండ్ తో వరుడికి గుండె పోటు వచ్చింది. డ్యాన్స్ చేస్తూనే వరుడు గణేష్ కుప్పకూలిపోయాడు. అతన్ని ఆస్పత్రికి తరలించేలోపే గణేష్ మృతి చెందారు. 

డిజె సౌండ్ వరుడి కలలను కల్లలు చేసింది. కాళ్ల పారాణైనా ఆరకముందే ప్రాణాలు తీసింది. బంధు మిత్రులతో కలలాడుతున్న సమయంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గణేష్ అనే యువకుడు అందరి సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నాడు. అదే సంతోషంలో రాత్రి బారాత్ కూడా జరిపించాడు. నూతన వధువుతో కలిసి తాను కూడా స్టెప్పు లేశాడు. డీజే సౌండ్ కు అనుగుణంగా స్టెప్పేసి మ్యారేజ్ ఈవెంట్ మర్చిపోలేని మధుర జ్ఞానపకంగా మార్చుకుందామనుకున్నాడు.

కానీ అంతలోనే అందరికీ దూరమయ్యాడు. అందరికీ అందని లోకాలు వెళ్లి కంటతడి పెట్టించాడు. డీజే సౌండ్ కు అస్వస్థతకు గురైన గణేష్..డ్యాన్స్ చేస్తూనే రోడ్డుపై కుప్పకూలిపోయాడు. ఏం జరిగిందో అర్థంకాని బంధువులు అతన్ని ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. అప్పటికే గణేష్ గుండెపోటుతో మరణించినట్లు డాక్టర్లు నిర్దారించారు.

దీంతో రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది. వైభంగా వివాహ జరిపించిన సంతోషం నిమిషాల్లోనే ఆవిరి కావడంతో తల్లిదండ్రులు గుండెలవిసిపో్యేలే రోధిస్తున్నారు. వివాహమైన కొద్ది గంటల్లోనే కట్టుకున్నవాడు మృతి చెందడంతో నవ వధువు కన్నీరుమున్నీరుగా విలిపిస్తోంది.

Read Here>>వైద్యం చేస్తున్న 1700 డాక్టర్లకీ కరోనావైరస్.. చైనాకొచ్చిన కొత్త కష్టం! 

Groom
die
Dance
marriage
barat
nizamabad
bodhan

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు