ఢిల్లీ సీఎం డెన్మార్క్ పర్యటనకు అనుమతి నిరాకరణపై స్పందించిన కేంద్రం

Submitted on 9 October 2019
Government On Why Arvind Kejriwal Was Denied Permission To Visit Denmark

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ డెన్మార్క్‌ పర్యటనకు అనుమతి నిరాకరణపై కేంద్రమంత్రి ప్రకాష్ జావదేకర్ ఇవాళ(అక్టోబర్-9,2019)స్పందించారు. మేయర్ స్థాయి వ్యక్తులు పాల్లొనే కార్యక్రమం కనుక ఆ కార్యక్రమంలో కేజ్రీవాల్ పాల్గొనేందుకు అనుమతి నిరాకరించినట్లు జావదేకర్ చెప్పారు.

డెన్మార్క్ లోని కోపెన్‌హాగన్‌లో జరిగే C-40 వాతావరణ మార్పు కార్యక్రమంలో కేజ్రీవాల్ పాల్గొని దేశ రాజధానిలో తమ ప్రభుత్వం పొల్యూషన్ ని తగ్గించడానికి చేస్తున్న కృషి గురించి మాట్లాడతారని గత నెలలో ఢిల్లీ ప్రభుత్వం అధికారికంగా విడుద చేసిన ప్రకటనలో ఉంది. ఇవాళ(అక్టోబర్-9,2019)డెన్మార్క్ లో ప్రారంభమయ్యే C-40 వాతావరణ మార్పు కార్యక్రమంలో పాల్గొనేందుకు మంగళవారం(అక్టోబర్-8,2019)కేజ్రీవాల్ఎనిమిది మంది సభ్యుల ప్రతినిధి బృందంతో డెన్మార్క్ బయల్దేరి వెళ్లాల్సి ఉంది.అయితే కేజ్రీవాల్ డెన్మార్క్ పర్యటనకు విదేశాంగశాఖ అనుమతి నిరాకరించింది. అయితే వెన్ట్ బెంగాల్ మంత్రి ఫిర్హాద్ హకీమ్ కి మాత్రం డెన్కార్క్ లో జరిగే ఈ సదస్సులో పాల్గొనడానికి విదేశాగంశాఖ అనుమతిచ్చింది. దీనిపై మోడీ సర్కార్ పై ఆమ్ ఆద్మీ పార్టీ ఫైర్ అయ్యింది. ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వం పట్ల మోడీ సర్కార్ శత్రుత్వ ధోరణి ప్రదర్శిస్తోందని ఆరోపించారు.

ఇది చాలా దురదృష్టకరమని మోడీ ప్రభుత్వానికి తమ పట్ల ఎందుకు అంత శత్రుత్వ ధోరణి ప్రదర్శిస్తోందని ఆర్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ అన్నారు. ఇది కేజ్రీవాల్ వ్యక్తిగత పర్యటన కాదని,సరదాగా గడిపేందుకు ఆయన డెన్మార్క్ వెళ్లాలనుకోలేదని, ఢిల్లీలో ఏ విధంగా పొల్యూషన్ ని 25శాతం తగ్గించామో అన్న దానిని ఆసియాలోని 100సిటీ మేయర్లకు వివరించడానికి,సరి-బేసి స్కీమ్ లాభాలను వివరించేందకే ఆయన డెన్మార్క్ లో జరిగే కార్యక్రమానికి వెళ్లాలనుకున్నారని,అలాంటప్పుడు ఆయన పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరించడం ప్రజాస్వామ్యానికి మంచిదికాదని సంజయ్ సింగ్ అన్నారు.

కేజ్రీవాల్ డెన్మార్క్ పర్యటనకు అనుమతి నిరాకరణ పట్ల ఆప్ నుంచి విమర్శలు వ్యక్తమవుతున్న సమయంలో ఇవాళ దీనిపై స్పందించిన జావదేకర్...డెన్మార్క్ లో జరగుంది మేయర్ల స్థాయి సమావేశం అని,ముఖ్యమంత్రులు వంటి రాజకీయ నాయకులను ఆహ్వానించినప్పుడు ప్రత్యేక ప్రోటోకాల్ ఉందని ఆయన అన్నారు.
బెంగాల్ మంత్రి మాత్రమే ఈ సమావేశంలో పాల్గొంటున్నట్లు జావదేకర్ తెలిపారు.

Delhi
CM
Aravind kejriwal
DENMARK
PERMISSION.PRAKASH JAVADEKHAR
FORIGN MINISTRY
MAYOR LEVEL
climate change
PROTOCAL

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు