కాంబో రిపీట్

Submitted on 15 February 2019
Gopichand 27th movie is confirmed with Director Sampat Nandi-10TV

గోపిచంద్ హీరోగా, తమిళ డైరెక్టర్ తిరు దర్శకత్వంలో, ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై, అనిల్ సుంకర నిర్మిస్తున్న సినిమా షూటింగ్ ప్రస్తుతం, ఇండియా, పాకిస్థాన్ బోర్డర్‌లో గల జైసల్మేర్ దగ్గర జరుగుతుంది. దాదాపు రూ. 32 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కబోతుంది. స్పై థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాకి మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతమందిస్తున్నాడు. గోపీచంద్‌కి జోడీగా నటించే హీరోయిన్ ఎవరనేది ఇంకా తెలియలేదు. గోపీచంద్ తన తర్వాత సినిమాని సంపత్ నంది డైరెక్షన్‌లో చెయ్యబోతున్నాడు. గతంలో వీరిద్దరి కాంబోలో గౌతమ్ నంద సినిమా వచ్చింది.. టాక్ బాగున్నా, పెద్దగా ఆడలేదు.. టీవీలో మాత్రం బాగానే చూసారు.

 

ఎమైంది ఈవేళ, రచ్చ, బెంగాల్ టైగర్, గౌతమ్ నంద సినిమాలు డైరెక్ట్ చెయ్యడంతో పాటు, గాలిపటం, పేపర్ బాయ్ సినిమాలకు నిర్మాతగానూ వ్యవహరించాడు సంపత్.. గోపీచంద్‌తో చెయ్యబోయే సినిమాని, శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై, కె.కె.రాధా మోహన్ నిర్మించనున్నాడు. గోపీచంద్ పంతం, సంపత్ ఎమైంది ఈవేళ, బెంగాల్ టైగర్ సినిమాలకు నిర్మాత ఈయనే.. సంపత్ చెప్పిన స్క్రిప్ట్ నచ్చడంతో గోపీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమాకి మిక్కి జె మేయర్ మ్యూజిక్ అందించనున్నాడు. మిగితా నటీనటులు, టెక్నీషియన్స్ వివరాలు త్వరలో తెలియచేస్తారు.. కామెడీ, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందబోయే ఈ సినిమా.. ఏప్రిల్‌లో ప్రారంభం కానుందని తెలుస్తుంది.

Gopichand
Gopichand 27th
Micky J Meyer
K.K. Radha Mohan
Sampat Nandi

మరిన్ని వార్తలు