బీ అలర్ట్ : గూగుల్ ప్లస్, ఇన్‌బాక్స్‌ బై జీమెయిల్ మూసివేత

Submitted on 22 March 2019
Google to shut down Google plus and Inbox by Gmail on April 2

ప్రముఖ ఆన్ లైన్ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ తమ రెండు సర్వీసులను షట్ డౌన్ చేయనుంది. ఏప్రిల్ 2 నుంచి గూగుల్ ప్లస్, ఇన్ బాక్స్ బై జీమెయిల్ యాప్ సర్వీసును పూర్తిగా తొలగించనుంది. జీమెయిల్ యాప్ సర్వీసును 2019 మార్చి నెలాఖరులో షట్ డౌన్ చేయబోతున్నట్టు 2018 సెప్టెంబర్ లోనే గూగుల్ ప్రకటించింది. అయితే కచ్చితమైన తేదీని మాత్రం గూగుల్ వెల్లడించలేదు. ఇప్పటికే ఇన్ బాక్స్ యూజర్లకు గూగుల్ సపోర్ట్ గైడ్ ను రిలీజ్ చేసింది.
Read Also : బాబోయ్ ఇదేం వైవిధ్యం : కత్తులు, పాములతో బాడీ మసాజ్

జీమెయిల్ యాప్ మార్పులపై సూచనలు కూడా అందించింది. ఇన్ బాక్స్ బై జీమెయిల్ యాప్ సర్వీసును షట్ డౌన్ చేయబోతున్న విషయాన్ని జూన్ 2018లోనే గూగుల్ కొన్ని సంకేతాలు ఇచ్చింది. ఆ తర్వాత గూగుల్ ప్లస్, ఇన్ బాక్స్ సర్వీసును నిలిపివేయనున్నట్టు గూగుల్ ప్రకటన జారీ చేసింది. ఇప్పటికే ఇన్ బాక్స్ యూజర్లకు గూగుల్ వరుసగా షట్ డౌన్ విషయమై నోటీసులు పంపుతోంది. ఈ రోజు నుంచి మరో 15 రోజుల్లో మీ ఇన్ బాక్స్ బై జీమెయిల్ షట్ డౌన్ చేస్తున్నట్టు నోటీసుల్లో అలర్ట్ చేస్తూ వస్తోంది. 

ఏప్రిల్ 2 నుంచి సర్వీసులు నిలిపివేత :
ఏప్రిల్ 2వ తేదీ నుంచి ఇన్ బాక్స్ జీమెయిల్ సర్వీసులు అధికారికంగా నిలిచిపోనున్నాయి. అదే రోజున గూగుల్ ప్లస్ సర్వీసు కూడా నిలిపివేయనున్నట్టు గూగుల్ తమ ప్రకటనలో తెలిపింది. ఇన్ బాక్స్ యూజర్లు చెక్ చేసుకోవచ్చు.. ‘ఈ యాప్ సర్వీసు మరో 15 రోజుల్లో నిలిచిపోనుంది’ అంటూ అలర్ట్ చూడవచ్చు. మీ జీమెయిల్ అప్లికేషన్ లోని ఫావరేట్ ఇన్ బాక్స్ ఫీచర్లలో ఈ మెసేజ్ లను చూడవచ్చు. ఆండ్రాయిడ్ మొబైల్ యూజర్లు చాలామంది ఈ ఇన్ బాక్స్ బై జీమెయిల్ యాప్ ను వాడుతున్నారు. వీరికి కూడా గూగుల్ అలర్ట్ లు పంపించింది. ఏప్రిల్ 2 నుంచి ఇన్ బాక్స్ యాప్ నిలిచిపోతుందని, జీమెయిల్ మెయిన్ యాప్ కు లింక్ చేసుకోవాలని సూచిస్తోంది. 
Read Also : రౌడీ రాజకీయాలపై పవన్ ఫైర్ : తాట తీస్తానంటూ హెచ్చరిక

ఐఓఎస్ యూజర్లు కూడా ఈ ఇన్ బాక్స్ జీమెయిల్ యాప్ ను వాడుతున్నారు. ఐఫోన్ యూజర్లకు కూడా మార్చి నెలాఖరులో ఇన్ బాక్స్ యాప్ సర్వీసు నిలిచిపోతుందని గూగుల్ అలర్ట్ చేస్తోంది. అంటే.. ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లు.. ఇన్ బాక్స్ సపరేట్ యాప్ ను వాడటం మానేసి.. మెయిన్ జీమెయిల్ యాప్ ను వినియోగించుకోవాలని సూచిస్తోంది. గూగుల్ అందించే పలు సర్వీసుల్లో ఇన్ బాక్స్ జీమెయిల్, గూగుల్ ప్లస్. వీటితో ఎన్నో అప్లికేషన్ సర్వీసులను గూగుల్ రన్ చేస్తోంది. గూగుల్ అందించే పలు సర్వీసు యాప్ లలో గూగుల్ మాప్స్, జీమెయిల్, గూగుల్ ప్లే, యూట్యూబ్, గూగుల్ డ్యుయో, గూగుల్ ప్లే మ్యూజిక్, గూగుల్ ఫొటోలు, గూగుల్ డ్రైవ్ ఫుల్ పాపులారిటీగా నిలిచాయి.  
Read Also : సీటు గోవిందా..! : సిట్టింగ్‌లకు నో ఛాన్స్

google
Shut Down
Inbox by Gmail
email app   

మరిన్ని వార్తలు