ఇదే ఫస్ట్ టైం : ఎలక్షన్ రిజల్ట్స్ Live ఇచ్చిన గూగుల్

Submitted on 23 May 2019
Google showing poll results live across its platforms

ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ దేశవ్యాప్తంగా 2019 ఎన్నికల ఫలితాలకు సంబంధించి లైవ్ అప్ డేట్స్ కవరేజ్ చేసింది. ఆన్ లైన్ సెర్చ్ ప్లాట్ ఫాం యూట్యూబ్, గూగుల్ అసిస్టెంట్ యాప్ లో ఎన్నికల ఫలితాలను గూగుల్ లైవ్ ఇవ్వడం ఇదే తొలిసారి.

భారత ఎన్నికల కమిషన్ సోర్స్ నుంచి జాతీయ, నియోజకవర్గాల వారీగా గూగుల్ ఎలక్షన్ రిజల్ట్స్ డిస్ ప్లే చేసింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్, కాయో డివైజ్ ల్లో గూగుల్ అసిస్టెంట్ యాప్ సర్వీసు ద్వారా ఎన్నికల ఫలితాలను డిస్ ప్లే చేసింది. 

మే 23, 2019న ఎన్నికల ఫలితాలను విడుదల చేయగా.. తమ యూట్యూబ్ సర్వీసు ద్వారా 150 న్యూస్ ఛానెళ్లలో Election Live Results  ను కవరేజ్ ఇచ్చినట్టు గూగుల్ ఇండియా, సౌత్ ఇండియా, పబ్లిక్ పాలసీ డైరెక్టర్ చేతన్ క్రిష్ణస్వామి తెలిపారు. యూట్యూబ్ యూజర్ల కోసం దూరదర్శన్ ఎలక్షన్ లైవ్ రిజల్ట్స్ కవరేజ్ ఇచ్చింది.

ఇండియాలోని డీడీ వీక్షకుల కోసం  DD న్యూస్ మొత్తం 12 భాషల్లో యూట్యూబ్ ఛానల్లో లైవ్ వీడియో స్ట్రీమింగ్ ఇచ్చింది. ఎయిర్ యూట్యూబ్ ఛానల్ పై న్యూస్ అనే సిగ్మంట్ లో ‘లైవ్ ఆడియో న్యూస్’ ద్వారా వీక్షకులు ఎలక్షన్ లైవ్ కవరేజ్ వీక్షించవచ్చునని గూగుల్ తెలిపింది. 
Google showing poll results live across its platforms

google
poll results
Youtube
Google Assistant
DD news
Live Audio News

మరిన్ని వార్తలు