ఆర్బీఐకి హైకోర్టు ప్రశ్న: Google Payకు లైసెన్స్ ఉందా?

Submitted on 10 April 2019
Is Google Pay operating Service without licence, Delhi High court asks RBI

డిజిటల్ పేమెంట్స్ యాప్స్ వచ్చాక ఆన్ లైన్ ట్రాన్స్ జెక్షన్లు బాగా పెరిగిపోయాయి. ఆన్ లైన్ పేమెంట్ ప్రాసెస్ ఈజీగా ఉండటంతో అందరూ ఇదే ఫాలో అవుతున్నారు. బ్యాంకు వెబ్ సైట్ తో సంబంధం లేకుండా నేరుగా డిజిటల్ పేమెంట్స్ ప్లాట్ ఫాం నుంచే ఇతరుల బ్యాంకు అకౌంట్లలో నగదు ట్రాన్స్ ఫర్ చేసుకోసుకునే  వీలుంది. డిజిటల్ పేమెంట్స్ సర్వీసు అందించే ప్లాట్ ఫాంల్లో గూగుల్ పే పేమెంట్ సర్వీసు ఒకటి. గూగుల్ పే మొబైల్ యాప్ ద్వారా యూజర్లు తమ బ్యాంకు అకౌంట్లో  నగదును మరో బ్యాంకు అకౌంట్లోకి ఈజీగా ట్రాన్స్ జెక్షన్ చేస్తున్నారు.
Read Also : కన్నీటిని తాగేస్తున్నాయి : ఆమె కంట్లో తేనెటీగలు

అసలు గూగుల్ పే సర్వీసుకు లైసెన్స్ ఉందా? ఫైనాన్షియల్ ట్రాన్స్ జెక్షన్స్ రన్ చేయడానికి అధికారికంగా అనుమతి ఉందా? ఈ ప్రశ్న అడిగింది ఎవరో కాదు.. ఢిల్లీ హైకోర్టు. Google Pay సర్వీసుకుకు సంబంధించి ఆర్బీఐ, గూగుల్ ఇండియా డిజిటల్ సర్వీసు ప్రైవేట్ లిమిటెడ్ ను హైకోర్టు ప్రశ్నించింది. దీనికి సంబంధించి వివరణ ఇవ్వాల్సిందిగా సూచించింది. Payment System ఆపరేటర్ల జాబితాలో గూగుల్ పే సర్వీసు లేదు. పేమెంట్ అండ్ సెటిల్ మెంట్ సిస్టమ్ యాక్ట్ 2007 కింద 82 మంది డిజిటల్ పేమెంట్స్ ఆపరేటర్లకు Reserve Bank ధ్రువీకరణ పత్రాలను జారీ చేసింది. 

ఢిల్లీ హైకోర్టులో పిల్.. గూగుల్, ఆర్బీఐకి నోటీసులు :
ఇండియాలో ఆపరేటింగ్ పేమెంట్ సిస్టమ్ నిర్వహించేందుకు ఆర్బీఐ సదరు ఆపరేటర్లకు ఆథరైజేషన్ సర్టిఫికేట్లను జారీచేసింది. పేమెంట్ సిస్టమ్స్ ఆపరేటర్ల జాబితాను 2019, మార్చి 20న ఆర్బీఐ రిలీజ్ చేసింది. ఈ జాబితాలో గూగుల్ పే సర్వీసు లేదు. దీన్ని ప్రస్తావిస్తూ.. అబిజిత్ మిశ్రా అనే వ్యక్తి ఢిల్లీ హైకోర్టులో వేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం (PIL) దాఖలు చేశాడు. ఈ పిల్ పై విచారించిన డివిజన్ బెంచ్ చీఫ్ జస్టిస్ రాజేంద్ర మీనన్, జస్టీస్ అనూప్ జైరాం భాంబాణితో కూడిన ధర్మాసనం.. ఆర్బీఐ, గూగుల్ కు నోటీసులు జారీచేసింది.

పే సర్వీసు.. నిలిపివేసేలా ఆదేశాలివ్వండి :
యూజర్ల వ్యక్తిగత వివరాలైన ఆధార్, పాన్ కార్డులను అనాధికారికంగా గూగుల్ పే యాక్సస్ చేస్తోందని, ట్రాన్స్ జెక్షన్లు పేమెంట్ అండ్ సెటిల్ మెంట్స్ సిస్టమ్స్ ద్వారా ఆపరేట్ చేస్తున్నట్టు మిశ్రా తన పిటిషన్ లో ప్రస్తావించారు. దేశంలో గూగుల్ పే సర్వీసును వెంటనే నిలిపివేయాలంటూ RBIకి ఆదేశాలు ఇవ్వాలంటూ పిటిషనర్ కోర్టుకు విన్నవించారు. అనాధికారిక ట్రాన్స్ జెక్షన్లపై గూగుల్ పే కు జరిమానా విధించాల్సిందిగా పిల్ అభ్యర్థించారు. దీనిపై గూగుల్ పే ఇప్పటివరకూ ఎలాంటి అధికారిక ప్రకటన రిలీజ్ చేయనప్పటికీ.. ఆర్బీఐ ఎలా స్పందిస్తుందో చూడాలి.  
Read Also : స్పామర్లకు ట్విట్టర్ షాక్ : రోజుకు 400 ఫాలోవర్స్ మాత్రమే

Delhi High Court
RBI
Google Pay
Payment service
Digital payment system
Abhijit Mishra
PIL 


మరిన్ని వార్తలు