రూ. 200 డిస్కౌంట్ : PUBG mobile ప్లేయర్లకు Google ఆఫర్ 

Submitted on 8 November 2019
Google giving Rs 200 coupon to PUBG MOBILE players for in-game purchase: Here's how to get it

ఆండ్రాయిడ్ పబ్‌జీ మొబైల్ ప్లేయర్లకు గుడ్ న్యూస్. సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ స్పెషల్ ఆఫర్ ప్రకటించింది. పబ్ జీ గేమ్ ఐటమ్స్ కొనుగోలు చేసేవారికి డిస్కౌంట్ కూపన్ అందిస్తోంది. ఒక్కో ఆర్డర్ పై రూ.200 వరకు డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి పబ్ జీ ప్లేయర్లు నోటిఫికేషన్ చేసుకోవచ్చు. గేమ్ కు సంబంధించి ఐటమ్స్ లో కనీసం రూ.350 విలువైన ఐటమ్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. 

అప్పుడే గూగుల్ ప్లే అందించే డిస్కౌంట్ కూపన్ సొంతం చేసుకోవచ్చు. గేమ్స్ ఐటమ్స్ కొనేందుకు యూజర్ల కోసం అదనపు క్యాష్ ఆదా చేసే అవకాశాన్ని గూగుల్ అందిస్తోంది. అవును. మీకు నమ్మకం లేదా? గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్లి నోటిఫికేషన్స్ సెక్షన నేవిగేట్ చేయండి ఓసారి. అక్కడ మీకో ఆఫర్ కనిపిస్తుంది చూడండి. మిగతా ఆఫర్ల మాదిరిగానే ఈ ఆఫర్ కూడా టర్మ్స్ అండ్ కండీషన్స్ కూడా అప్లయ్ అవుతాయి. లిమిటెడ్ పిరియడ్ మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. 

ఇన్ గేమ్ ఐటమ్స్ కొనేందుకు డిస్కౌంట్ కూపన్ గురించి తెలుసుకోవాలి. పబ్‌జీ గేమ్ ప్లేయర్లు ముందుగా పబ్‌జీ మొబైల్ స్టోర్ నుంచి ఏదైనా ఒక గేమ్ ఐటమ్ కొనాలి. ఆ మొత్తం ధరపై డిస్కౌంట్ లభిస్తుంది. ఈ డిస్కౌంట్ రూ.200 వరకు ఉంటుంది. పబ్ జీ మార్కెట్ ప్లేస్ నుంచి మీరు కొనుగోలు చేసే ప్రతిది దీనికి వర్తిస్తుంది.

అయితే ఈ కూపన్ డిస్కౌంట్ రాయల్ పాస్ సీజన్ 10 లేదా గేమ్ ఐటమ్స్ లో ఏదైనా ఐటమ్ కొన్నా వర్తిస్తుంది. ఈ గేమ్ లో రూ.350 నుంచి వచ్చే UC పాయింట్లతో చీపెస్ట్ ఐటమ్ ఏదైనా కొనొచ్చు. దీనిపై రూ.200 వరకు డిస్కౌంట్ వర్తిస్తుంది. 

అప్పుడు అదనంగా UC పాయింట్స్ సొంతం చేసుకోవచ్చు. తద్వారా రూ.150 వరకు ఏదైనా ఐటమ్ కొనవచ్చు. రూ.200 డిస్కౌంట్ పొందాలంటే పబ్ జీ ప్లేయర్లు.. ప్లే స్టోర్ విజిట్ చేయాలి. నోటిఫికేషన్స్ సెక్షన్ కింద కొత్త నోటిఫికేషన్ బార్ చెక్ చేయండి. అక్కడే ఒక కూపన్ కనిపిస్తుంది. పబ్ జీ మొబైల్.. రూ.200 డిస్కౌంట్ మెసేజ్ ఉంటుంది. Claim now బటన్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు గేమ్ ఓపెన్ చేసి తర్వాత నచ్చిన గేమ్ ఐటమ్ కొనడమే. 

గూగుల్ ప్లే స్టోర్ నుంచి పేమెంట్ చేయాల్సి ఉంటుంది. డిస్కౌంట్ కూపన్ అప్లయ్ అవుతుంది. రూ.200 డిస్కౌంట్ వస్తుంది. ఈ కూపన్ ఏదైనా సీజన్ 10 కంటెంట్ కు మాత్రమే వర్తిస్తుంది. మరో కూపన్ కావాలంటే.. 24 గంటల సమయం ఎదురుచూడాలి. సీజన్ 10 అప్ డేట్ ద్వారా మరిన్ని అదనపు కొత్త ఫీచర్లు తీసుకోస్తోంది. ఇందులో కొత్త మ్యాప్ (డెత్ మ్యాచ్ మోడ్), కొత్త వెహికల్, వికెండి మ్యాప్ కోసం ఆయుధం, కొత్త స్కిన్లు, క్లాత్స్ మరిన్నో ఉన్నాయి. 

google
200 coupon
PUBG MOBILE players
in-game purchase
limited period of time
Android users

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు