గూగుల్ ఎర్త్ 4K HD ఫొటోలను ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకోండి.. స్ర్కీన్ వాల్ పేపర్‌గా సెట్ చేసుకోండి

Submitted on 12 February 2020
Google Earth just released 1,000 beautiful wallpapers you can download for free

ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ అందించే సర్వీసుల్లో గూగుల్ ఎర్త్ సర్వీసు ఒకటి. ఇటీవలే ఈ సర్వీసును మొబైల్ వెర్షన్ లోనూ గూగుల్ అప్ డేట్ చేసింది. ఏడాది నుంచి గూగుల్... ఎర్త్ వ్యూ ద్వారా వేలాది అద్భుతమైన వాల్ పేపర్లను సేకరిస్తోంది. ఈ ఆకర్షణీయమైన ప్రదేశాలను శాటిలైట్ వ్యూ నుంచి క్యాప్చర్ చేసింది.

ఇవి చూడటానికి ఆకాశం నుంచి పక్షి కన్నుతో కిందికి చూస్తే ఎలా కనిపిస్తుందో అ విధంగా ఉన్నాయి. భూ ఉపరితలంపై సముద్రాలతో కూడిన ప్రాంతాన్ని అద్భుతంగా క్యాప్చర్ చేసింది. ఏడాది కాలంగా శాటిలైట్ల నుంచి తీసిన ఈ ఫొటోలను గూగుల్ కంపెనీ తమ గ్యాలరీలో మరో 1000 వాల్ పేపర్లగా చేర్చింది. దీంతో మొత్తంగా 2,500 వాల్ పేపర్లను రిలీజ్ చేసింది.

కొత్త ఎర్త్ వ్యూ ఫొటోలను నేటి స్ర్కీన్ల కోసం ఆప్టిమైజ్ చేసినట్టు కంపెనీ తెలిపింది. బ్రైట్ కలర్స్, షార్పర్ ఇమేజ్‌లు, 4K వరకు రెజుల్యుషన్స్ తో కూడిన ఎన్నో అద్భుతమైన వాల్ పేపర్లను గూగుల్ గ్యాలరీలో అప్ లోడ్ చేసింది. గూగుల్ ఎర్త్ వ్యూ గ్యాలరీలోని ఈ వాల్ పేపర్లను మీరు కూడా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. Earth View Chrome Extension ఇన్ స్టాల్ చేయడం ద్వారా ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

కొత్త ఇమేజ్ క్లిక్ చేసిన ప్రతిసారి కొత్త విండో ఓపెన్ అవుతుంది. ఇందులో కొత్త కలర్ మ్యాప్ ద్వారా ఫొటోల కలర్ షార్ట్ చేసుకోవచ్చు. ఇలాంటి వాల్ పేపర్లు మీ స్మార్ట్ ఫోన్లు లేదా డెస్క్ టాప్, ల్యాప్ టాప్ వంటి డివైజ్ ల్లో వాల్ పేపర్లుగా లేదా స్ర్కీన్ సేవర్లుగా కూడా సెట్ చేసుకోవచ్చు. గూగుల్ ఈ ఎర్త్ వ్యూ ఇమేజ్ లను ఎలా క్యాప్చర్ చేస్తుందో ఈ కింది వీడియోలో చూడొచ్చు.

Google Earth
1
000 beautiful wallpapers
download for free

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు