చెక్ చేశారా? : ‘గూగుల్ డ్యుయో’ గ్రూపు వీడియో కాలింగ్ లిమిట్ పెరిగింది

Submitted on 22 May 2019
Google Duo Group Video Calling Limit Increased to 8 People

ఆల్ఫాబెట్ టెక్ దిగ్గజం గూగుల్ అందించే సర్వీసు ‘గూగుల్ డ్యుయో’ వీడియో కాలింగ్ ఫీచర్ లిమిట్ పెరిగింది. ఇప్పటివరకూ ఈ వీడియో కాలింగ్ లో నలుగురికి మాత్రమే అనుమతి ఉంది. ఇకపై గ్రూపు వీడియో కాలింగ్ లో యూజర్లు.. ఒకేసారి 8 మంది వరకు జాయిన్ కావచ్చు.

ఏప్రిల్ నెలలో గూగుల్ డ్యుయోలో వీడియో కాలింగ్ ఫీచర్ ను గూగుల్ ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ ను ప్రవేశపెట్టిన నెలలోనే వీడియో కాలింగ్ లిమిట్ ను పెంచడం విశేషం. ఈ ఫీచర్ ప్రారంభంలో ఇండోనేషియాకు మాత్రమే పరిమితి ఉంది. కానీ, క్రమంగా బ్రెజిల్, కెనడా, ఇండియా, మెక్సికో, యూఎస్, ఇతర ప్రాంతాలకు పరిమితిని విస్తరించారు.

గ్రూపు వీడియో కాలింగ్ ఫీచర్ పరిమితిని నలుగురి నుంచి 8 మంది వరకు పరిమితి పెంచినట్టు ఇంజినీరింగ్ లీడ్ ఆఫ్ గూగుల్ డ్యుయో, ప్రిన్సిపల్ ఇంజినీర్ గూగుల్ జస్టిన్ ఉబెర్టి ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఈ కొత్త అప్ డేట్ తో.. డ్యుయో యూజర్లు.. అదనంగా మరో 7 గురు సభ్యులను గ్రూపు వీడియో కాల్స్ కు యాడ్ చేసుకోవచ్చు.

గూగుల్ డ్యుయో యాప్ లేటెస్ట్ అప్ డేట్ .. ఆండ్రాయిడ్, ఐఫోన్ డివైజ్ సఫోర్ట్ చేస్తుందని తెలిపారు. ఫేస్ బుక్ సొంత యాప్ వాట్సాప్ మెసేంజర్ కు పోటీగా గూగుల్.. డ్యుయో గ్రూపు వీడియో కాలింగ్ ఫీచర్ పరిమితిని పెంచింది. వాట్సాప్ గ్రూపు వీడియో కాలింగ్ లో.. ఒక సింగల్ గ్రూపులో నలుగురికి మాత్రమే జాయిన్ అయ్యే అవకాశం ఉంది. 

Google Duo
Group Video Calling
Limit Increase
WhatsApp

మరిన్ని వార్తలు