గూగుల్ డూడల్ చూశారా : ‘WWW’ పుట్టి 30 ఏళ్లు

Submitted on 12 March 2019
Google Doodle Celebrates World Wide Web's 30th Birthday

వరల్డ్ వైడ్ వెబ్.. అంటే (WWW)అని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ప్రతిఒక్కరూ ఏదో ఒక వెబ్ సైట్ కోసం గూగుల్ లో సెర్చ్ చేసినప్పుడు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ వెబ్ అడ్రస్ తో సెర్చ్ చేస్తుంటారు. రోజుకు ఎన్నో వెబ్ సైట్ల వెబ్ అడ్రస్ చూస్తుంటారు. ప్రతి వెబ్ సైట్ వెబ్ అడ్రస్ (డొమైన్) (www.google.com) ఇందులో WWW తో లింక్ అయి ఉంటుంది. డేటా ప్రాసెసింగ్ జరగాలంటే డొమైన్, హోస్టింగ్ సర్వర్ ల మధ్య WWW వారధిలా పనిచేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉన్న వరల్డ్ వైడ్ వెబ్ ను ఫాలో అవ్వాల్సిందే. లేదంటే వెబ్ సైట్ డేటాను సెర్చ్ చేయలేరు. 
Read Also : వాట్సాప్‌లో కొత్త బగ్ : యూజర్ల ఫొటోలు డిలీట్ చేస్తోంది 

ఇంతకీ WWW ఎప్పుడు పుట్టింది.. ఎవరు దీన్ని తొలుత క్రియేట్ చేశారో మీకు తెలుసా? వరల్డ్ వైడ్ వెబ్ పుట్టి మంగళవారం (ఫిబ్రవరి 12, 2019) నాటికి 30 ఏళ్లు పూర్తవుతుంది. ఈ సందర్భంగా ప్రముఖ ఆన్ లైన్ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ World Wide Web వార్షికోత్సవాన్ని సెలబ్రేట్ చేసింది. గూగుల్ తన హోం పేజీలో (వరల్డ్ వైడ్ వెబ్) డూడుల్ ను ఆవిష్కరించింది. ఈ వరల్డ్ వైడ్ వెబ్ ను 1989 మార్చి 12న క్రియేట్ చేశారు. బ్రిటీష్ భౌతికశాస్త్రవేత్త టిమ్ బెర్నర్స్ -లీ  (www)ను సృష్టించారు. యూరోపియన్ ఫిజిక్స్ ల్యాబ్ CERN లో పనిచేస్తున్న టిమ్ లీ.. సిస్టమ్ ఇన్ఫర్మేషన్ మెనేజ్ మెంట్ వికేంద్రీకరించాలని ప్రతిపాదించారు. అప్పుడే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ సృష్టీకరణకు పునాది పడింది. 

అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల (ఎందరో కోట్లాది) మంది ప్రజలు వరల్డ్ వైడ్ వెబ్ ను వాడుతున్నారు. హైపర్ టెక్ట్స్ లింక్ సిస్టమ్ తో అనుసంధానం చేయాల్సిందిగా అప్పట్లో టిమ్ లీ సూచించారు. దీని ద్వారా పేజీపై క్లిక్ చేసే కీ వర్డ్స్ సాయంతో డైరెక్ట్ గా ఒక పేజీ నుంచి మరో పేజీకి వెళ్లేలా టెక్నాలజీని రూపొందించడంలో సక్సెస్ సాధించారు. వరల్డ్ వైడ్ వెబ్ క్రియేట్ చేసి 30 ఏళ్ల మైలు రాయిని చేరిన సందర్భంగా గూగుల్ ప్రత్యేకంగా యానిమేషన్ తో కూడిన డూడుల్ ను హోంపేజీపై డిసిప్లే చేసింది. ఈ యానిమేషన్ లో బ్లాక్ గ్రాఫిక్స్ ను రూపొందించింది.
Read Also : PubG ఆడుతున్నారా? : రూ.14కోట్ల ప్రైజ్ మనీ

సెంటర్ లో డెస్క్ టాప్ మానిటర్ పై గ్లోబ్ రొటేట్ అవుతున్నట్టు చూడొచ్చు. ‘ఇంటర్నెట్.. వరల్డ్ వైడ్ వెబ్ అంటే ఏంటి అనే కన్ ఫ్యూజన్ అక్కర్లేదు. 1960 నాటికే ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చేసింది. ఆ తరువాత వరల్డ్ వైడ్ వెబ్ ఆన్ లైన్ ఆప్లికేషన్ ను డెవలప్ చేశారు. HTML లాంగ్వేజ్, URL అడ్రస్, హైపర్ టెక్స్ ట్రాన్స్ ఫర్ ప్రొటోకాల్ (HTTP)తో వరల్డ్ వైడ్ వెబ్ ఆన్ లైన్ Application డెవలప్ చేయడం జరిగింది’ అని గూగుల్ తన బ్లాగ్ పోస్టులో తెలిపింది. 

Google Doodle
World Wide Web
30th Birthday
doodle
WWW 

మరిన్ని వార్తలు