అస్సలు మిస్ కావొద్దు : ఓటు నమోదుకు లాస్ట్ ఛాన్స్

Submitted on 22 March 2019
Good News, Another Chance For Voter Registration

ఏపీ ఎన్నికల సంఘం గుడ్ న్యూస్ వినిపించింది. ఓటరు జాబితాలో తమ పేరు ఉందో లేదో తెలుసుకోవడానికి మరో అవకాశం ఇచ్చింది. రాష్ట్రంలోని ప్రతి పోలింగ్ కేంద్రంలో మార్చి 23, 24 తేదీలలో ప్రత్యేక శిబిరాలు  ఏర్పాటు చేసి జాబితాలు ప్రదర్శించనుంది. ఆ జాబితాలో పేర్లు లేనివారు ఓటరుగా పేరు నమోదు చేసుకోవాలని ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. నిరక్షరాస్యులైన ఓటర్ల సౌకర్యార్ధం అందరికీ వినిపించేలా  జాబితాను చదవాలని అధికారులు ఆదేశించారు. ఓటు నమోదుకు ఇది లాస్ట్ ఛాన్స్ అని.. దీన్ని అస్సలు మిస్ కావొద్దని అధికారులు సూచించారు.

ఓటర్ల జాబితాలో పేర్లు లేని వారు తమ పేరు నమోదు చేసుకోవడానికి ఎన్నికల కమిషన్‌ మార్చి 15వ తేదీ వరకే గడువు ఇచ్చింది. అయితే ఓటర్ల అక్రమ తొలగింపు వ్యవహారం ఏపీలో రాజకీయ దుమారం రేపింది.  ఓటర్లకు తెలియకుండానే ఓట్లు తొలిగిపోయాయి. దీంతో తమ ఓటు హక్కు ఉందో లేదో తెలియక అంతా ఆందోళన చెందారు. జాబితాలో తమ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవడానికి క్యూ కట్టారు. ఒక్కసారిగా అంతా ఈసీ వెబ్ సైట్ మీద పడటంతో సర్వర్లు మొరాయించాయి. దీంతో చాలామంది ఇబ్బందులు పడ్డారు. ఓటు నమోదు చేసుకోవడం సాధ్యంకాలేదని వాపోయారు. అర్హత కలిగిన వారంతా ఓటు హక్కు నమోదు  చేసుకునేందుకు అవకాశం కల్పిస్తూ గడువును పొడిగించాలని పెద్ద ఎత్తున ఈసీకి విజ్ఞప్తులు అందాయి. వీటిని పరిగణలోకి తీసుకున్న ఎన్నికల అధికారులు.. ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

పోలింగ్‌ తేదీ సమీపిస్తోంది. ఏప్రిల్‌ 11న వజ్రాయుధం లాంటి ఓటు హక్కును వినియోగించుకోవాలంటే జాగ్రత్త పడాల్సిందే. ముందుగా ఓటరు జాబితాలో పేరుందో? లేదా? చూసుకోవాలి. లేకపోతే వెంటనే ఓటు నమోదు కోసం ఫారం-6తో దరఖాస్తు చేసుకోవాలి. ఏప్రిల్ 11న ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది.

VOTE
Voter Registration
AP
ap ceo gopala krishna dwivedi
camps
AP Voters

మరిన్ని వార్తలు