డోపింగ్ టెస్టులో ఫెయిలైన గోమతి మరిముత్తు

Submitted on 22 May 2019
Gomathi Marimuthu failed in dope test

ఆసియా చాంపియన్‌షిప్ టైటిల్ గెలుచుకుని క్రీడా ప్రపంచంలో సత్తా చాటిన ప్లేయర్ గోమతి మరిముత్తు.. విజయం అనంతరం కష్టాలను, కన్నీళ్లను మీడియా ముందు పంచుకోవడంతో మరింత అభిమానం పెరిగిపోయింది. అనూహ్యంగా టైటిల్ ముగిసిన వెంటనే డోపింగ్ టెస్టులో ఫెయిలై ఆశ్చర్యానికి గురి చేసింది. 

30ఏళ్ల గోమతి అనబొలిక్ స్టెరాయిడ్స్ అధికంగా తీసుకోవడం వల్లే ఇలా జరిగిన ఉండొచ్చని సమాచారం. అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధికారి  ఒకరు మాట్లాడుతూ.. 'ఆమె తన రక్త నమూనా ఇచ్చి నిరూపించుకునే అంతవరకూ నిషేదం ఎదుర్కోవలసి ఉంటుంది. గరిష్ఠంగా 4ఏళ్ల పాటు నిషేదానికి గురికావచ్చు.. రక్త నమూనా పరీక్షల్లో కూడా డోపింగ్‌కు పాల్పడినట్లు వస్తే భారత్ స్వర్ణం కోల్పోయే అవకాశముంది. 

ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ అథ్లెటిక్స్ ఫెడరేషన్స్ గోమతి డోపింగ్ టెస్టులో ఫెయిలైందంటూ మంగళవారం సోషల్ మీడియా ద్వారా బయటపెట్టింది. విషయం విన్న వెంటనే గోమతి షాక్‌కు గురైనట్లు తెలిపింది. బ్లడ్ శాంపుల్‌లో అయినా గోమతికి అనుకూలంగా రిపోర్ట్ వస్తుందని ఆశిస్తుంది. 

Gomathi Marimuthu

మరిన్ని వార్తలు