గోల్డ్ మ్యాన్ సాచ్‌ ఉద్యోగి ఘారానా మోసం : పోకర్ గేమ్ అప్పుల కోసం.. 10నిమిషాల్లో రూ.38 కోట్లు కొట్టేశాడు!

Submitted on 11 September 2019
Goldman Sachs VP Ashwani Jhunjhunwala arrested for allegedly swindling firm of Rs 38 cr to pay off poker debt

ఆన్‌లైన్‌లో ఆడే పోకర్ గేమ్ (మూడు ముక్కలాట)కు బానిసై అప్పులు పాలైన మల్టీ నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ గోల్డ్ మ్యాన్ సాచ్ సంస్థ సీనియర్ ఉద్యోగి పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. వాల్ స్ట్రీట్ బ్యాంకుకు వైస్ ప్రెసిడెంట్ అయిన అశ్వన్ జన్ జన్వాలాకు  పోకర్ గేమ్ అంటే పిచ్చి. ఈ గ్యాంబ్లింగ్ గేమ్ కు బానిసైన అశ్వన్.. 70వేల డాలర్ల వరకు అప్పులు చేశాడు. తన పోకర్ గేమ్ అప్పుల తీర్చేందుకు తన కంపెనీ అకౌంట్ నుంచి 5.4 మిలియన్ల డాలర్లు (రూ.38.8 కోట్లు)ను ఒక ప్రైవేట్ అబ్రాడ్ కు ట్రాన్స్ పర్ చేశాడు. అప్పటినుంచి పరారీలో ఉన్న నిందితుడు అశ్వన్‌ను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు.

జూనియర్ ఉద్యోగులను మోసగించి :
గోల్డ్ మ్యాన్ సాచ్ చేసిన ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అశ్వన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కంపెనీకి చెందిన కోట్లాది సొమ్మును మరో ఫైనాన్షియల్ మేనేజర్ అకౌంట్ కు యాక్సస్ ఇచ్చాడు. ఆ అకౌంట్ నుంచి తన అకౌంట్ కు నగదు బదిలీ చేసుకున్నాడు. సెప్టెంబర్ 4న కేవలం 10 నిమిషాల్లోనే కోట్లాది నగదును తన అకౌంట్లోకి బదిలీ చేశాడు. కంపెనీలోని అంతర్గత యంత్రాంగం అనుమానిత లావాదేవీలు జరిగినట్టు గుర్తించడంతో ఈ స్కాం వెలుగులోకి వచ్చింది. అకౌంట్ నుంచి ట్రాన్స్ జాక్షన్ జరిగిన రెండు గంటల్లోనే గుర్తించి ఉద్యోగి అశ్వన్‌ను ప్రశ్నించారు. గ్ల్యాంబింగ్ గేమ్ కోసం చేసిన అప్పులను తీర్చేందుకు ఈ మోసానికి పాల్పడినట్టు పోలీసుల విచారణలో అంగీకరించాడు. తన అప్పుల కోసం బ్యాంకులో రుణం తీసుకున్నాడు. తన ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు కొంతమంది దగ్గర అప్పులు చేసినట్టు కంపెనీ తెలిపింది.

కంపెనీ అకౌంట్లో డబ్బులు కాజేసేందుకు అశ్వన్.. ముగ్గురు జూనియర్ ఉద్యోగుల కంప్యూటర్లను ఉపయోగించి.. సంస్థ బ్యాంకు అకౌంట్ల నుంచి 5.4 మిలియన్ల డాలర్లను ట్రాన్స్ ఫర్ చేసినట్టు కంపెనీ యాజమాన్యం ఆరోపించింది. గోల్డ్ మ్యాన్ ఫిర్యాదు ప్రకారం.. అశ్వన్.. కంపెనీలోని ముగ్గురు జూనియర్ ఉద్యోగులను సంప్రదించి వారికి శిక్షణ ఇస్తున్నట్టుగా నటించాడు. ఆ తర్వాత ఆ ముగ్గురిని ఏదో పనిమీద బయటకు పంపించాడు. వారి కంప్యూటర్లతో సాయంతో చైనీస్ బ్యాంకు అకౌంట్ కు కోట్లాది నగదు ట్రాన్స్ ఫర్ చేసినట్టు తెలిపింది. మోసానికి పాల్పడిన నిందితుడు అశ్వన్ ను ఉద్యోగం నుంచి తొలగించినట్టు కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. బెంగళూరు గోల్డ్ మ్యాన్ కంపెనీలో దాదాపు 5వేల ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇందులో పనిచేసేవారంతా ఇంజినీరింగ్, టెక్నాలజీ, బ్యాక్ అండ్ ఉద్యోగులే ఉన్నారు. 

Goldman Sachs
Ashwani Jhunjhunwala
swindling firm
poker debt

మరిన్ని వార్తలు