నాకేం తక్కువ : రెండు కాళ్లతోనే నడుస్తున్న బుజ్జి మేక 

Submitted on 22 March 2019
Goat walking with two legs

అంగవైకల్యాన్ని అధిగమించి రికార్డులు..అద్భుతాలు సృష్టించే మనుషులు ఎందరో.  తమకున్న లోపానికి కృంగిపోకుండా పలు రికార్డులు క్రియేట్ చేసేవారిని మనం చాలామందిని చూసుంటాం. కానీ జంతువుల్లో కూడా అంతటి పట్టుదల ఉందని నిరూపించింది ఓ బుజ్జి మేకపిల్ల. అమ్మ కడుపులోంచి భూమిమీద పడేసమయానికే ఆ బుజ్జి మేక పిల్లకు రెండు కాళ్లు చచ్చుబడిపోయాయి. దాంతో ఆ యజమాని అది బ్రతకదని అనుకున్నాడు. కానీ అందరినీ ఆశ్చర్యపరుస్తు..అచ్చం మనిషిలాగానే రెండు కాళ్లతో నచేస్తోంది ఈ బుజ్జి మేకపిల్ల. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బీహార్‌లోని రాందిరీ గ్రామంలో ఈ బుజ్జిమేక పిల్ల ఎట్రాక్షన్ గా మారిపోయింది.  
Read Also : సెల్ఫీ ప్లీజ్ : వామ్మో.. ఎయిర్ పోర్ట్ లో షార్క్.. ప్రయాణీకులు షాక్

పుట్టుకతో వచ్చిన వైకల్యాన్ని అధిగమించి..యజమాని అంచనాలను తల్లక్రిందులు చేస్తు ఆ మేకపిల్ల నడవటం నేర్చేసుకుంది. అంతేకాదు రెండు కాళ్లతో చకచకా నడిచేస్తు..దాని మేతను అదే సందపాదించుకుంటోంది. నాలుగు కాళ్లు ఉన్న మేకలకు నేనేమీ తీసిపోను అని నిరూపించింది మేకపిల్ల. పుట్టినకాడ్నుంచి అది రెండు కాళ్లతో నడిచేస్తుంటే దాని యజమాని ఆశ్చర్యపోయాడు. ఆనందపడ్డాడు.  సోషల్ మీడియాలో తన ఆనందాన్ని పంచుకున్నాడు. ఈ మేకపిల్లను చూసేందుకు చుట్టుపక్కల ప్రజలు తరలివస్తున్నారు. ప్రస్తుతం ఈ మేక వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా చక్కర్లు కొడుతున్నాయి. 
Read Also : హలో ఈసీ : హెల్ప్ లైన్ 1950 స్పెషల్ అదే

BIHAR
Randiari
Village
goat
Two Legs
Walking
social media
Weiler


మరిన్ని వార్తలు