హైదరాబాద్ లో గ్లోబర్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ సదస్సు

Submitted on 21 February 2019
 Glober R..D Conferen  in Hyderabad

హైదరాబాద్ నగరం అంతర్జాతీయ సదస్సులకు వేదికగా మారింది. పలు అంతర్జాతీయ అంశాలపై చర్చలకు కేంద్రమవుతోంది. ఇంటర్నేషనల్ స్థాయిలో రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ లో పరస్పర సహకారం అందించుకునేకు నగరంలో గ్లోబల్ ఆర్ అండ్ డీ సమ్మిట్ -2019 సదస్సు నిర్వహిస్తున్నట్లు ఉన్నతవిద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి తెలిపారు. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ (ఫిక్కీ), కేంద్ర ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ సంయుక్తంగా గ్లోబల్ రిసెర్చ్ అండ్ అండ్ డెవలప్‌మెంట్ (ఆర్‌అండ్‌డీ) అంశంపై గురు, శుక్రవారాల్లో (ఫిబ్రవరి 21, 22) నగరంలోని మారియట్ హోటల్లో ఉదయం 10.30 గంటలకు ఈ సదస్సు ప్రారంభం అవుతుందనీ.. ఈ సదస్సుకు కేంద్ర శాస్త్ర సాకేంతిక శాఖామంత్రి హర్షవర్థన్ ప్రసంగించనున్నారని పాపిరెడ్డి తెలిపారు.   
 

ఆస్ట్రేలియాతో పాటు నాలుగు దేశాల ప్రభుత్వ ప్రతినిధులు హాజరుకానున్నారు. స్థిరమైన వృద్ధికోసం పరిశోధన, అభివృద్ధిలో అంతర్జాతీయ సహకారం, భారత్, ఆఫిక్రా దేశాల మధ్య సహకారానికి సంబంధించిన పలుఅంశాలు, పరిశ్రమలు, ప్రభుత్వ, విద్యారంగాల్లో సాధించాల్సిన విజయాలు, నూతన సహాయసహకారాల అన్వేషణ, ఆలోచనల మార్పిడితో ప్రయోజనాలు, సేవలు, ఉత్పత్తులు తదితర అంశాలపై సదస్సులో చర్చలు కొనసాగుతాయని పాపిరెడ్డి చెప్పారు.

మొదటిరోజు ప్రసంగంలో కేంద్ర ప్రభుత్వ డిపార్ట్ మెంట్ ఆఫ్ సైన్స్ టెక్నాలజీ కార్యదర్శి అశుతోష్ శర్మ, ఫిక్కీ వైస్ ప్రెసిడెంట్ సంగీతారెడ్డి, ఇథియోపియా సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్  ఇంజనీర్ గెటహాన్ మెకురియా తదితరులు పాల్గొననున్నారు. అనంతరం సెషల్ లో ఇన్నోవేషణ్, టెక్నాలజీ ట్రాన్స్ ఫర్, కమర్షియలైజేషన్ ప్రోగ్రాం వంటి అంశాలపై చర్చించనున్నారు.

Telangana
Hyderabad
Global R & D Summit -2019
conference
Union Minister
Harsh Vardhan
Papi Reddy

మరిన్ని వార్తలు