అక్షయ్ కుమార్-కేసరి టీజర్

Submitted on 12 February 2019
  Glimpses of Kesari - Part 1 -10TV

బాలీవుడ్‌లో డిఫరెంట్ కాన్సెప్స్ట్‌తో సినిమాలు చేస్తూ, వరస విజయాలతో జెట్ స్పీడ్‌తో దూసుకెళ్తున్నాడు, అక్షయ్ కుమార్.. రజినీ 2.ఓ తో నెగెటివ్ రోల్‌లోనూ ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం అక్షయ్, అనురాగ్ సింగ్ డైరెక్షన్‌లో కేసరి మూవీ చేస్తున్నాడు. ధర్మా ప్రొడక్షన్స్, కేప్ ఆఫ్ గుడ్ ఫిలింస్, అజూర్ ఎంటర్‌టైన్‌మెంట్, జీ స్టూడియోస్ కలిసి నిర్మిస్తున్నాయి. రీసెంట్‌గా, గ్లింప్స్ ఆఫ్ కేసరి-పార్ట్ 1 పేరుతో ఫస్ట్ టీజర్ రిలీజ్ చేసారు మేకర్స్. ఈ సినిమాలో అక్షయ్.. హవీల్దార్ ఇషార్ సింగ్‌గా కనిపించబోతున్నాడు.

అతనికి జోడీగా పరిణీతి చోప్రా నటిస్తుంది. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న కేసరి టీజర్ ఆకట్టుకుంటుంది. అక్షయ్ ఒక చేతితో ఖడ్గం, మరో చేతితో పెద్ద రింగు లాంటిది పట్టుకుని ఉండగా, జనాలు పెద్ద ఎత్తున పరిగెడుతూ అతని దగ్గరకి రావడం చూపించారు టీజర్‌లో.. అన్షుల్ చౌబే ఫోటోగ్రఫీ, రాజు సింగ్ ఆర్ఆర్ బాగున్నాయి. కేసరితో పాటు, మిషన్ మంగళ్, గుడ్‌న్యూస్, హౌస్‌ఫుల్ 4 సినిమాలు చేస్తున్నాడు అక్షయ్ కుమార్.. మార్చి 21 న కేసరి రిలీజవబోతుంది.

వాచ్ కేసరి టీజర్...

 

Akshay Kumar
Parineeti Chopra
Dharma Productions
Cape of Good Films
Azure Entertainment
Zee Studios Anurag Singh


మరిన్ని వార్తలు