డియర్ కామ్రేడ్ థర్డ్ సాంగ్ విన్నారా?

Submitted on 20 June 2019
Gira Gira Gira Lyrical Video Song from Dear Comrade

సెన్షేషనల్ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా, భరత్ కమ్మా దర్శకత్వంలో, మైత్రీ మూవీ మేకర్స్, బిగ్ బెన్ బ్యానర్స్‌పై.. నవీన్ ఎర్నేని, మోహన్ చెరుకూరి, వై.రవిశంకర్, యష్ రంగినేని నిర్మిస్తున్న సినిమా.. డియర్ కామ్రేడ్. (ఫైట్ ఫర్ వాట్ యూ లవ్). ఇంతకుముందు రిలీజ్ చేసిన డియర్ కామ్రేడ్ టీజర్ అండ్ రెండు సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇప్పుడు ముచ్చటగా మూడో లిరికల్ సాంగ్ రిలీజ్ చేసింది మూవీ యూనిట్.

'గిరగిరగిర తిరగలిలాగా తిరిగీ అరిగీ పోయినా దినుసే నలగ లేదులే.. అలుపెరగక తనవెనకాలే అలసీ సొలసీ పోయినా మనసే కరగలేదులే'.. అంటూ సాగే పాట కూల్‌గా వినడానికి బాగుంది. జస్టిన్ ప్రభాకర్ ట్యూన్‌కి రెహ్మాన్ లిరిక్స్ రాయగా, యామిని ఘంటసాల, గౌతమ్ భరద్వాజ్ కలిసి పాడారు. విజువల్స్‌ని బట్టి ఫంక్షన్ నేపథ్యంలో ఈ పాట వస్తుందని అర్థమవుతుంది.

తెలుగుతో పాటు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఈ పాటను విడుదల చేసారు. గీతగోవిందం తర్వాత విజయ్, రష్మిక కలిసి నటిస్తున్న డియర్ కామ్రేడ్ జూలై 26న రిలీజ్ కానుంది. కెమెరా : సుజిత్ సారంగ్, ఎడిటింగ్ అండ్ డిఐ : శ్రీజిత్ సారంగ్, డైలాగ్స్ : జయకృష్ణ, లిరిక్స్ : రెహ్మాన్, ఆర్ట్ : రామాంజనేయులు, స్టంట్స్ : G (మురళి)
 

Vijay Deverakonda
Rashmika
Justin Prabhakaran
Bharat Kamma

మరిన్ని వార్తలు