ఇక అక్రమ కట్టడాలు నేలమట్టం 

Submitted on 15 February 2020
GHMC ready to demolish completely illegal structures in Hyderabad

హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలను పూర్తిగా నేలమట్టం చేయాలని జీహెచ్‌ఎంసీ యోచిస్తోంది. ఇందులో భాగంగా ఆధునిక వాహనాన్ని తెప్పించాలని నిశ్చయించారు. ఎంత ఎత్తైన భవనమైనా, ఎంత పటిష్టమైన పిల్లరైనా పూర్తిగా కూల్చివేసే సామర్థ్యం ఈ యంత్రాల ప్రత్యేకత. ప్రస్తుతం పుణె మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఈ వాహనాన్ని ఉపయోగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం అక్రమ నిర్మాణాలను మనుషులతో కూల్చుతున్నారు. కేవలం స్లాబులు, గోడలకు మాత్రమే కూల్చి వదిలేస్తున్నారు. దీం నిర్మాణదారులు మళ్లీ వాటిని పునరిద్ధరించుకుంటున్నారు. 

అక్రమ నిర్మాణాలపై హైకోర్టు ఆగ్రహం 
ఇటీవల హైకోర్టు అక్రమ నిర్మాణాలపై ఆగ్రహం వ్యక్తం చేయడంతోపాటు కూల్చివేత విధానంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ఎటువంటి అపోహలకు తావులేకుండా అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని జీహెచ్‌ఎంసీ భావిస్తోంది. ఇందులో భాగంగా పుణెలో ఉపయోగిస్తున్న విధంగా ఆధునిక డెమోలిషన్‌ వాహనాన్ని అద్దె ప్రాతిపదికన తెప్పించాలని నిర్ణయించినట్లు, దీనికి రోజువారీ అద్దె చెల్లించాలా లేక పనిచేసినప్పుడు గంటల ప్రకారం అద్దె చెల్లించాలా అనేది ఇంకా నిర్ణయించాల్సి ఉందని కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌ తెలిపారు. దీని వ్యయం రూ.17కోట్లు ఉంటుందని, అందుకే కొనుగోలుచేయకుండా అద్దె ప్రాతిపదికన ఉపయోగించుకోవాలని నిశ్చయించినట్లు పేర్కొన్నారు. 

లక్షల సంఖ్యలో అక్రమ నిర్మాణాలు
నగరంలో అక్రమ నిర్మాణాల సంఖ్య లక్షల్లో ఉంది. బీఆర్‌ఎస్‌ పథకానికే సుమారు 1.2లక్షల దరఖాస్తులు వచ్చాయంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. 2008లో ప్రవేశపెట్టిన బీఆర్‌ఎస్‌ పథకానికి సైతం 1.5లక్షల దరఖాస్తులొచ్చాయి. అక్రమ భవనాల్లో పూర్తిగా అనుమతులు లేకుండా నిర్మించే భవనాలు, చెరువులు, కుంటలు, రోడ్లు, నాలాలు తదితర వాటిని ఆక్రమించుకొని నిర్మించుకునే భవనాలున్నాయి 

Read Here>>వైద్యం చేస్తున్న 1700 డాక్టర్లకీ కరోనావైరస్.. చైనాకొచ్చిన కొత్త కష్టం!   

GHMC
ready
DEMOLISH
illegal structures
Hyderabad

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు