RBI చెప్పినా డోంట్ కేర్ : రూ.10 నాణేలు చెల్లవంటున్న GHMC

Submitted on 14 April 2019
GHMC parks not accepting Rs 10 coins

హైదరాబాద్ : పది రూపాయల నాణేల చెల్లుబాటు గొడవ మళ్లీ మొదటికొచ్చింది. రూ.10 నాణేలు చెల్లుబాటు అవుతాయని స్వయంగా ఆర్బీఐ ప్రకటించినా ప్రయోజనం లేకుండా పోయింది. కొన్ని చోట్ల 10 రూపాయల కాయిన్స్ తీసుకోవడం లేదు. అవి చెల్లవు అని తెగేసి చెబుతున్నారు. టెన్ రూపీ కాయిన్ ఇస్తే మీద పడి దాడి చేసినంత పని చేస్తున్నారు.

ఏఎస్ రావు నగర్ లో ఇలాంటి ఘటన ఒకటి వెలుగు చూసింది. స్థానికంగా ఒక పార్క్ ఉంది. అది జీహెచ్ఎంసీ ఆధ్వరంలో ఉంది. జీహెచ్ఎంసీ తరుఫున ఓ కాంట్రాక్టర్ ఆ పార్క్ ని నిర్వహిస్తున్నాడు. పార్క్ లోకి ఎంట్రీ ఫీజు టికెట్ ధర 10 రూపాయలు. పార్క్ కి వెళ్లే కాలనీ వాసులకు కాంట్రాక్టర్ చుక్కలు చూపిస్తున్నాడు. టికెట్ కోసం ఇచ్చే 10 రూపాయల నాణేలు తీసుకోవడం లేదు. ఎందుకు తీసుకోరు అని అడిగితే.. 10 రూపీ కాయిన్స్ చెల్లవని చెబుతున్నారు. 2 నెలలుగా ఇదే తీరు. దీంతో కాలనీ వాసులు విసిగిపోయారు. 10 రూపాయల కాయిన్స్ ఎందుకు తీసుకోవడం లేదని పార్క్ నిర్వాహకుడితో గొడవపడ్డారు. దీనికి అతడు చెప్పిన సమాధానం విని ఏడ్వాలో నవ్వాలో వారికి అర్థం కాలేదు.

పది రూపాయల నాణేలను కేంద్రం బ్యాన్ చేసిందని, అవి చెల్లవు అని, ఎందుకూ పనికిరావు అని కాంట్రాక్టర్ సమాధానం చెప్పాడు. దీంతో కాలనీవాసులు కంగుతిన్నారు. వాటిని కేంద్రం ఎప్పుడు బ్యాన్ చేసిందో తెలియక కన్ ఫ్యూజ్ అయ్యారు. ఇక లాభం లేదని ఈ విషయాన్ని వారు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ట్విట్టర్ లో తమ బాధను మొరపెట్టుకున్నారు. 10 రూపాయల కాయిన్స్ చెల్లుబాటు అవుతాయని స్వయంగా ఆర్బీఐ ప్రకటించినా.. వాటిని తీసుకోవడం లేదని వాపోయారు. ఈ సమస్యను పరిష్కరించాలని అధికారులను కోరారు. వెంటనే జీహెచ్‌ఎంసీ అధికారులు దీనిపై స్పందించి.. ఆ కాంట్రాక్టర్ కి జ్ఞానోదయం చెయ్యాలని, 10 రూపాయల కాయిన్స్ తీసుకునేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

పది రూపాయల నాణేల చెల్లుబాటుపై ఇప్పడే కాదు.. గతంలో రచ్చ జరిగింది. అవి చెల్లవు అనే ప్రచారం కలకలం రేపింది. కొంతమంది వ్యాపారులు 10 రూపాయిల కాయిన్స్ తీసుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది. వ్యవహారం ఆర్బీఐ వరకు వెళ్లింది. వెంటనే స్పందించిన ఆర్బీఐ వర్గాలు.. క్లారిటీ ఇచ్చాయి. అవి చెల్లుబాటు కావంటూ వస్తున్న వార్తలు పుకార్లేనని స్పష్టం చేసింది. ప్రస్తుతం 14 రకాల డిజైన్లలో రూ.10 నాణేలు చెలామణిలో ఉన్నాయని, అవన్నీ చెల్లుబాటు అవుతాయని 2018 జనవరి 17లోనే ప్రకటించింది. లావాదేవీలకు లీగల్ టెండర్ గా వీటిని కొనసాగించవచ్చని తెలిపింది. ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక అంశాలు ప్రతిబింబించేలా ఎప్పటికప్పుడూ వివిధ ఫీచర్లతో రూ.10 నాణేలను ప్రవేశపెడుతున్నామని, ఇప్పటివరకూ 14 రకాల నాణేలను విడుదల చేశామని ఆర్బీఐ తెలిపింది. ఈ నాణేల చట్టబద్ధత విషయంలో ఎలాంటి అనుమానాలు అవసరం లేదని, వీటిని లావాదేవీల కోసం వినియోగించుకోవచ్చని స్పష్టం చేసింది. బ్యాంకులు కూడా ఈ నాణేలను స్వీకరించాలని, బ్రాంచుల దగ్గర వీటిని మార్చుకోవచ్చని తెలిపింది. ఆర్బీఐ ఇంతగా మొత్తుకుంటున్నా.. పుకార్లు మాత్రం ఆగడం లేదు.

GHMC
parks
not accepting
Rs 10 coins
as rao nagar
RBI
Currency
ban

దేశంలో టిక్ టాక్ యాప్ బ్యాన్ చేయటాన్ని సమర్ధిస్తారా?

Choices

మరిన్ని వార్తలు