‘సరిలేరు నీకెవ్వరు’ దివాళీ ట్రీట్

Submitted on 21 October 2019
Get Ready for Sarileru Neekevvaru Diwali Treat

సూపర్ స్టార్ మహేష్, అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ నుంచి దసరా స్పెషల్‌గా రిలీజ్ చేసిన లుక్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు దీపావళికి ట్రీట్‌ ఇవ్వబోతున్నాడు. ఈ విషయాన్ని డైరెక్టర్ అనిల్ రావిపూడి సోషల్ మీడియా ద్వారా షేర్ చేశాడు.

‘విలన్ హౌస్ షెడ్యూల్ పూర్తయింది.. సరిలేరు నీకెవ్వరు నుంచి దీవాళి ట్రీట్ కోసం రెడీగా ఉండండి’ అంటూ ఓ స్పెషల్ పోస్టర్ షేర్ చేశాడు.. మహేష్ బాబు, అనిల్ సుంకర, దిల్ రాజు కలిసి నిర్మిస్తున్నండగా.. రష్మిక హీరోయిన్‌గా నటిస్తుంది.

Read Also : బాహుబలి స్క్రీనింగ్ : ఆల్బర్ట్ హాల్ అదిరింది!

ఈ సినిమాలో మహేష్ ఆర్మీ మేజర్ అజయ్ కృష్ణగా కనిపించనున్నాడు. విజయశాంతి, బండ్ల గణేష్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తుండగా.. రాక్ స్టార్ డీఎస్పీ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. సంక్రాంతి కానుకగా 2020 జనవరి 12న ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Mahesh Babu
Rashmika
Devi Sri Prasad
Anil Ravipudi
Sankranthi 2020

మరిన్ని వార్తలు