బాయ్‌ఫ్రెండ్‌ను చితకబాది యువతిపై సామూహిక అత్యాచారం

Submitted on 21 January 2020
gang rape on a young woman in tamilnadu

తమిళనాడులో దారుణం జరిగింది. బాయ్‌ఫ్రెండ్‌ను చితకబాది, కత్తితో బెదిరించి యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన శనివారం వేళ్లూరులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వేళ్లూరు పట్టణ కేంద్రం మధ్యలో ఉన్న కోట సమీపంలో రాత్రి 7 గంటల ప్రాంతంలో బాయ్ ఫ్రెండ్ తో కలిసి యువతి వెళ్తోంది. ముగ్గురు వ్యక్తులు బాయ్ ఫ్రెండ్ పై దాడి చేసి తీవ్రంగా కొట్టారు. అనంతరం యువతిని కత్తితో బెదిరించి ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. 

అనంతరం వారి వద్ద ఉన్న వస్తువులను సైతం అపహరించుకుపోయారు. అత్యాచారం, దోపిడి కేసులు నమోదు చేసిన పోలీసులు 18 ఏళ్ల వయస్సున్న ఇద్దరు యువకులను అరెస్ట్‌ చేశారు. పరారీలో ఉన్న మరొకరి కోసం లుక్‌అవుట్‌ నోటీసులు జారీ చేశారు.

ప్రభుత్వ విడుదల చేసిన నివేదిక ప్రకారం 2018లో భారత్‌లో ప్రతీ 15 నిమిషాలకు ఓ అత్యాచార ఘటన చోటుచేసుకున్నట్లు ఓ మహిళ పేర్కొంది. కేంద్ర హోంశాఖ రిపోర్ట్‌ ప్రకారం 2018లో మొత్తం 34 వేల అత్యాచార కేసులు నమోదయ్యాయి. కానీ ఈ సంఖ్య వాస్తవానికి ఇంకా ఎక్కువగానే ఉంటుందని తెలిపారు.
 

Gang Rape
Young woman
tamilnadu
Attack
Boy friend

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు