కిరాతకం : లవర్స్ పై దాడి.. యువతిపై గ్యాంగ్ రేప్, హత్య

Submitted on 12 February 2019
Gang rape on girl in In Guntur District Mangalgiri Mandalam Nawaluru

అమరావతి : గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నవులూరులో ప్రేమ జంటపై దాడి జరిగింది. సోమవారం (ఫిబ్రవరి 11)రాత్రి 9 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. ఏకాంత ప్రదేశంలో ఉన్న ప్రేమికులు జ్యోతి, శ్రీనివాస్ పై నలుగురు యువకులు దాడి చేశారు. దుండగులపై జ్యోతి, శ్రీనివాస్ తిరగబడ్డారు. దీంతో వారు మరింత రెచ్చిపోయారు. ప్రియుడు శ్రీనివాస్ ను బీరు సీసాలతో కొట్టారు. అతను తీవ్రంగా గాయపడ్డాడు. ప్రియురాలు జ్యోతిని కూడా కొట్టిన నలుగురు యువకులు.. ఆ తర్వాత అత్యాచారం చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నవులూరు ఉడా టౌన్‌షిప్‌లో సమీపంలోని క్రికెట్ స్టేడియం ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.

 

తాడేపల్లి మహానాడుకు చెందిన జ్యోతి గుంటూరులోని కాలేజ్ లో సర్టిఫికెట్స్ తీసుకునేందుకు ఇంటి నుంచి బయలుదేరింది. ప్రియుడు శ్రీనివాస్ తో కలిసి రాత్రి 9 గంటల సమయంలో స్టేడియంలోని ఓ ఏకాంత ప్రదేశానికి చేరుకుంది. వీరిని గమనించిన నలుగురు యువకులు ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో జ్యోతి అక్కడికక్కడే మృతి చెందింది. రక్తపు మడుగులో పడి ఉన్న శ్రీనివాస్ ను స్థానికులు, పోలీసులు ఆస్పత్రికి తరలించారు. శ్రీనివాస్ నుంచి వివరాలు సేకరిస్తున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ విచారణలో భాగంగా క్యూస్ టీమ్ డాగ్ స్వాడ్ తో ఘటనాస్థలంలో ఆధారాలను సేకరిస్తున్నారు.

AP
guntur
Love Pair
Jyothi
Srinivas
Attack
Gang Rape

మరిన్ని వార్తలు