మహా నిమజ్జనం : నిఘా నీడలో హైదరాబాద్ 

Submitted on 12 September 2019
 Ganesh immersion in Hyderabad is huge security

నగరంలో గణేష్ నిమజ్జనానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.  బాలాపూర్ గణేశ్ మొదలుకొని, ఖైరతాబాద్ వినాయకుడు సహా వేలాది లంబోదరులు ఇవాళ గంగమ్మ ఒడికి చేరనున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌ను నిఘా నీడలోకి తెచ్చారు పోలీసులు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా వేలాది మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. శోభాయాత్ర జరిగే రూట్లతోపాటు నిమజ్జన ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు.

గణేశ్ నిమజ్జనానికి పోలీసులు కూడా అంతా సిద్ధం చేశారు. దీని కోసం కేంద్ర, రాష్ట్ర బలగాలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆర్టికల్ 370 రద్దుతో ఇప్పటికే హైఅలర్ట్ ఉన్న నేపథ్యంలో..నిమజ్జనానికి తెలంగాణ పోలీస్ శాఖ పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ జరగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంది. ముఖ్యంగా శోభాయాత్ర జరిగేప్రాంతాలపై ప్రధానంగా దృష్టి సారించారు. 

> 3లక్షల సీసీ కెమెరాలను వినియోగిస్తున్నారు. 
> బాలాపూర్ నుంచి చార్మినార్ వరకు అడుగడుగునా సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు. ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జన రూట్‌లో 66 సీసీ కెమెరాలు, 4 మొబైల్ కెమెరాలు ఏర్పాటు చేశారు. 
> ట్యాంక్‌బండ్‌ వద్ద వందకుపైగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. 
> సిటీ కమిషనర్, డీజీపీ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్స్ కు అనుసంధానం చేశారు. 
> 8 కంపెనీల కేంద్ర బలగాలతో సహా మొత్తం 35వేల మంది పోలీసులతో భద్రతతగ ఏర్పాటు చేశారు. 
> నలుగురు అదనపు సీపీలు, 9 మంది డీసీపీలు, 20 మంది అదనపు డీసీపీలు, 64 మంది ఏసీపీలు, 244 మంది ఇన్‌స్పెక్టర్లు, 618 మంది ఎస్‌ఐలు, 636 మంది ఏఎస్సైలు, 1700 మంది హెడ్‌ కానిస్టేబుళ్లు, 7,198 మంది కానిస్టేబుళ్లు, 680 మంది ఎస్‌పిఓలు, 6000 మంది హోంగార్డులు నిమజ్జనం విధుల్లో పాల్గొననున్నారు. 
ఇతర విభాగాల నుంచి ఐదుగురు ఐజీలు, ఒక డీఐజీ, 19 మంది ఎస్పీలు, 53 మంది డీఎస్పీలు, 128 మంది సీఐలు, 129 మంది ఎస్సైలు, 15 మంది మహిళా ఎస్సైలు, 1,336 మంది ఏఎస్సైలు, 5,239 కానిస్టేబుళ్లు, 250 మహిళా కానిస్టేబుళ్లు, 1,426 మంది హోంగార్డులతో నిమజ్జనానికి భద్రత కల్పిస్తున్నారు.
> జియో ట్యాగింగ్‌ వినియోగించడం ద్వారా వినాయకులను తరలించే వాహనాలను ట్రాక్‌ చేయనున్నారు. 
> గణేశ్‌ శోభాయాత్రకు 17 ప్రధాన మార్గాలను ఎంపిక చేశారు. 
> నిమజ్జనానికి 10వేల లారీలను వినియోగిస్తున్నారు. 
> 66 ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు. సున్నితమైన ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. 605 ప్రాంతాలను మోర్ సెన్సిటివ్ ఏరియాలుగా గుర్తించి మరింత్ర ప్రత్యేక భద్రత ఏర్పాటు చేశారు.
Read More : బాలాపూర్ లడ్డూ..ఎందుకీ ప్రత్యేకత

Ganesh immersion
Hyderabad
huge security
Khairtabad Ganesh

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు