జాగ్రత్త పడండి : 26, 27 తేదీల్లో గండిపేట నీళ్లు బంద్

Submitted on 24 August 2019
Gandipeta Water No Supply In Greater Hyderabad Areas On Aug 26 and 27

గ్రేటర్ పరిధిలోని పలు ప్రాంతాలకు ఆగస్టు 26, 27 తేదీల్లో గండిపేట నీటి సరఫరాను నిలిపివేస్తున్నారు జలమండలి అధికారులు. ఉస్మాన్ సాగర్ కాల్వ, ఆసీఫ్ నగర్ నీటి శుద్ధి కేంద్రం వద్ద ఫిల్టర్ బెడ్ల మరమ్మత్తుల కారణంగా ఆగస్టు 26, 27 తేదీల్లో పలు ప్రాంతాలకు నీటి సరఫరా ఉండదని జలమండలి ప్రకటించింది. మరలా ఆగస్టు 28న తిరిగి నీటి సరఫరాను పునరుద్ధరిస్తామని జలమండలి అధికారులు వెల్లడించారు.

నీళ్లు రాని ప్రాంతాలివే : - 
కాకతీయ నగర్, సాలార్జంగ్ కాలనీ, పద్మనాభనగర్, ఖాదర్ బాగ్, విజయనగర్ కాలనీ, చింతల్ బస్తీ, హుమయూన్ నగర్, సయ్యద్ నగర్, ఏసీ గార్డ్స్, ఖైరతాబాద్, మల్లేపల్లి, బోయిగూడ కమాన్, ఆగాపూరా, నాంపల్లి, దేవీబాగ్, అఫ్జల్ సాగర్, సీతారాం బాగ్, హబీబ్ నగర్, ఎస్ఆర్‌టీ, జవహర్ నగర్, పీఎన్టీ కాలనీ, సాయన్నగల్లీ, అశోక్ నగర్, ఇలాచీగూడ, జ్యోతినగర్, వినాయక్ నగర్, మైసమ్మ బండ, ఎంసీ హెచ్ క్వార్టర్స్, సెక్రటేరియట్, రెడ్ హిల్స్, హిందీనగర్, గోడేఖీకబర్, గన్ ఫౌండ్రీ, దోమల్ గూడ, లక్డీకపూల్, మణికొండ, పుప్పాల్ గూడ, నార్సింగి ప్రాంతాలకు నీటి సరఫరా ఉండదని తెలిపారు. 
 

Gandipeta Water
No Supply
greater hyderabad
Areas
Aug 26 and 27
Jalamandali
Water Connection
Tap Water

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు