ఉచిత వైద్యసేవలు ఎక్కడ : వెలుగులోకి రవిప్రకాశ్-సిలికానాంధ్ర సంజీవని ఆస్పత్రి అక్రమాలు

Submitted on 9 October 2019
fraud in ravi prakash silicon andhra sanjivani hospitals

పేద ప్రజలకు ఉచితంగా అమెరికా స్థాయి వైద్యం అంటూ ప్రచారం.. సామాన్యుడి నుంచి ప్రవాసాంధ్రుల వరకూ.... కోట్లకు కోట్లు విరాళాల సేకరణ. అందరికీ చూపించడానికి భారీ బిల్డింగ్ నిర్మాణం. కానీ.. ఆస్పత్రిలో సేవలు మాత్రం నిల్‌. అత్యాధునిక వైద్యం కాదు కదా.. సాధారణ చికిత్స కూడా అక్కడ ఉచితంగా అందడం లేదు. ఇదీ కృష్ణా జిల్లా కూచిపూడిలోని రవిప్రకాశ్- సిలికానాంధ్ర సంజీవని ఆస్పత్రి వ్యవహారం. పేరు పెట్టుకోవడంలోనూ.. విరాళాలు సేకరించడంలోనూ శ్రద్ధ చూపించిన రవిప్రకాశ్.. ఆస్పత్రిలో చికిత్సల విషయంలో మాత్రం పట్టించుకోలేదు. అసలు..చికిత్సనందించే ఏర్పాట్లే చేయలేదు. 

ఈ వ్యవహారమంతటినీ 10టీవీ బయటపెట్టడంతో.. వైసీపీ నేత, పామర్రు ఎమ్మెల్యే కైలా అనిల్‌ కుమార్ స్పందించారు. వెంటనే రవిప్రకాశ్‌-సిలికానాంధ్ర సంజీవని ఆస్పత్రికి వెళ్లారు. హాస్పిటల్ మొత్తాన్ని పరిశీలించారు. అక్కడ చికిత్సలేవీ అందకపోవడంపై ఆస్పత్రి సిబ్బందిని నిలదీశారు. ఎమ్మెల్యే అడిగిన ప్రశ్నలకు ఆస్పత్రి సిబ్బంది సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారు.

కృష్ణా జిల్లా కూచిపూడిలోని రవిప్రకాశ్‌ సిలికానాంధ్ర సంజీవని ఆస్పత్రి దగ్గర కాసేపు ఉద్రిక్తత నెలకొంది. ఆస్పత్రిలో అక్రమాలు జరుగుతున్నాయంటూ ప్రశ్నించడానికి వెళ్లిన గ్రామస్తులపై... ఆస్పత్రి సిబ్బంది దాడికి దిగారు. బలవంతంగా బయటకు గెంటేసేందుకు ప్రయత్నించారు. దీంతో ఆగ్రహించిన స్థానికులు... ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. గతంలో సంజీవని హాస్పిటల్‌లో తమ బంధువులు చనిపోయారంటూ... కొందరు గ్రామస్తులు స్థానిక ఎమ్మెల్యే అనిల్‌కు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే అనిల్‌తో కలిసి ఆస్పత్రిలోకి వెళ్లిన స్థానికులతో సిబ్బంది దురుసుగా ప్రవర్తించారు.

Ravi Prakash
siliconandhra
sanjivani hospitals
fraud
funds
donations
mla kaila anil kumar
Pamarru

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు